Friday, November 22, 2024

వారసత్వ కట్టడాలను ప్రదర్శిస్తోన్న అంబరీష్‌ పిట్టి ..

హైదరాబాద్, (ప్రభ న్యూస్‌) : హైదరాబాద్‌కు చెందిన ఫోటోగ్రాఫర్‌ అంబరీష్‌ పిట్టి. తన నూతన ప్రాజెక్ట్‌ ద్వారా తన ఫోటోగ్రఫీ నైపుణ్యం ప్రదర్శిస్తున్నారు. దీనిలో భాగంగా వితవుట్‌ ఏ మ్యాప్‌ అంటూ వినూత్నమైన కాఫీ టేబుల్ బుక్‌ను సైతం అందుబాటులోకి తీసుకువచ్చారు. అత్యంత అందమైన ఆకాశం, మేఘాలను తెరగా ఉపయోగించి తాను తీసిన భారతదేశంలోని పలు వారసత్వ కట్టడాలను ఆయన ఈ కాఫీ టేబుల్‌ బుక్‌లో ప్రదర్శించారు. ఈ కాఫీ టేబుల్‌ బుక్‌ను హైదరాబాద్‌ నగరంలోని కళాకృతి ఆర్ట్‌ గ్యాలరీలో 03 జూన్‌ 2022 వరకూ ప్రదర్శనకు అందుబాటులో ఉంచారు. ఈ ప్రదర్శనను తెలంగాణా రాష్ట్ర నగరాభివృద్ధి, పురపాలక వ్యవహారాల శాఖ ప్రత్యేక కార్యదర్శి అర్వింద్‌ కుమార్‌ ప్రారంభించారు.

ఈ పుస్తకాన్ని తెలంగాణా ఏడీజీ పొలీస్‌ శిఖా గోయల్‌, విజయ్‌ కుమార్‌, ఐపీఎస్‌, ఏడీజీ పొలీస్‌, తెలంగాణా ఆవిష్కరించారు. ఈ ప్రదర్శన గురించి అంబరీష్‌ మాట్లాడుతూ… కళాకృతి ఆర్ట్‌ గ్యాలరీ వద్ద ఈ ప్రదర్శన నిర్వహించే అవకాశం లభించడాన్ని ఓ గౌరవంగా భావిస్తున్నానన్నారు. వితవుట్‌ ఏ మ్యాప్‌ అనేది తన హృదయానికి అతి దగ్గరగా ఉన్న ప్రాజెక్ట్‌ అన్నారు. తన అభిరుచి, నైపుణ్యం దీని సృష్టిలో జోడించానన్నారు. ఫోటోగ్రఫీలో ఓ కెమిస్ట్రీ ఉందని తాను నమ్ముతుంటానన్నారు. ఈ పుస్తకంలో ప్రతి ఫోటో తీయడానికి ఎంతో శ్రమించానన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement