Monday, December 23, 2024

Adilabad – హామీ నిలబెట్టుకోకపోతే ఢిల్లీలో ధర్నా చేస్తాం

100 రోజుల్లో పథకాలన్నీ అమలు చేస్తామన్నారు
300 రోజులు దాటినా ఒక్క పథకం అందలేదు
ఇప్ప‌టికే పోస్టు కార్డు ఉద్య‌మం
రాహుల్ గాంధీకి ముక్రా- కె. గ్రామస్తుల హెచ్చ‌రిక

ఆంధ్రప్రభ స్మార్ట్‌, ఆదిలాబాద్ బ్యూరో : ఎన్నికల్లో గెలిస్తే వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని హామీలు ఇచ్చిన కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ వీటి గురించి ఊసెత్తకపోవడం పై ఆదిలాబాద్ జిల్లా ముక్రా.. కె గ్రామ‌స్తులు పోస్టు కార్డు ఉద్య‌మం ప్రారంభించారు. ఈ మేర‌కు కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీకి పోస్టు కార్డులు పంపించారు.

కార్డులోని సారాంశం
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 100 రోజుల్లోనే ఆరు గ్యారంటీ పథకాలు అమలు చేస్తామని రాహుల్ గాంధీ సభాముఖంగా ప్రకటించారు. 300 రోజులు గడిచినా మహాలక్ష్మి పథకం కింద ప్రతినెల మహిళలకు ఇస్తామన్న రూ. 2,500 సాయం ఇప్పటికీ అమలు కాలేదు. కళ్యాణ లక్ష్మి కింద ఆడపడుచులకు లక్ష రూపాయల తులం బంగారం ఇస్తామని చెప్పి ఇంతవరకు అమలు చేయలేదు. ప్రతి కుటుంబానికి రూ .2 లక్షల రుణమాఫీ అర్హుల దరిచేరలేదు. పెన్షన్ రూ. 4 వేలు, వికలాంగుల పెన్షన్ 6 వేలు, కొత్త రేషన్ కార్డులు ఇప్పటికీ ఊసే లేదు. ఇప్పటికైనా ఇచ్చిన హామీలు నెరవేరకపోతే గ్రామస్తులంతా ఢిల్లీలో ధర్నా చేస్తామని హెచ్చ‌రించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement