హైదరాబాద్ :హైదరాబాద్ : ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ దేశం పరువు, జగన్ ఏపీ పరువు తీసేశారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, అమెరికాలో గౌతమ్ అదానీ బండారం బట్టబయలవడం.. దేశానికే అవమానమన్నారు. అదానీ కేసులో జగన్ లంచం తీసుకున్నట్టు స్పష్టంగా ఉందన్నారు. జగన్ అమెరికాకు డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ లేనందునే ఆరోపణల్లో జగన్ పేరును నేరుగా అమెరికా ప్రస్తావించలేదన్నారు.
లంచాల కోసం ప్రజలను తాకట్టుపెట్టడం దారుణం అన్నారు. ఒక్క సోలార్ ప్రాజెక్టలోనే అదానీ రూ.17 వందల కోట్లు ఇచ్చారంటే.. మిగిలిన ప్రాజెక్టుల్లోనూ ఇంకెంత లంచం ముట్టిందో అని మండిపడ్డారు. విశ్వసనీయత అనే పదానికి అర్ధం తెలుసా అని షర్మిల ప్రశ్నించారు. జగన్ నిర్వాకం వల్లే డిస్కంలు అప్పుల ఊబిలోకి చేరాయి అన్నారు. జగన్ విధానాలతో ప్రజలపై రూ.17 వేల కోట్ల భారం పడిందని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేసారు.