కృష్ణాజిల్లాలో 15సినిమా థియేటర్లు సీజ్ చేశారు. ఈ మేరకు థియేటర్లలో రెండోరోజు తనిఖీలు కొనసాగుతున్నాయి. లైసెన్స్ లేని 15థియేటర్ల మూసివేతకు ఆదేశాలు జారీ చేశారు.టికెట్ రేట్లు తగ్గించాలని, రూల్స్ పాటించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఏపీలోని పలు ప్రాంతాల్లో అధికారులు సినిమా థియేటర్లపై దాడులు నిర్వహించారు. రూల్స్ పాటించని వారిపై చర్యలు తీసుకున్నారు. కృష్ణాజిల్లా, విజయనగరం జిల్లాతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సినిమా థియేటర్లకు కేరాఫ్ అడ్రస్ అయిన విజయవాడ లోని పలు థియేటర్లలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అప్సర థియేటర్, పీవీఆర్, అలంకార్, అన్నపూర్ణ, శైలజ థియేటర్, క్యాపిటల్ సినిమాస్ తో పాటు మరికొన్ని థియేటర్లను తనిఖీలు చేసిన పోలీసులు టికెట్ల ధరల వివరాలను సేకరించడంతో పాటు పార్కింగ్ సౌకర్యాలను పరిశీలించారు. థియేట్లలోనే క్యాంటీన్లలో తినుబండారాలను అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు తెలుసుకున్నారు. నగరంలోని అన్ని థియేటర్లను పరిశీలించి నివేదికను ప్రభుత్వానికి పంపుతామని పోలీసులు తెలిపారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..