Friday, November 22, 2024

సభ నుంచి కాంగ్రెస్‌ వాకౌట్‌

  • .హైదరాబాద్ -ప్రజా సమస్యలపై మాట్లాడకుండా గొంతు నొక్కుతున్నారని ఆరోపిస్తూ కాంగ్రెస్‌ సభ్యులు సభ నుంచి వాకౌట్‌ చేశారు. అనంతరం కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు గన్‌పార్కు వద్ద మీడియాతో మాట్లాడారు. ‘‘సీఎం, మంత్రులు కావాలనే సభను తప్పుదోవ పట్టిస్తున్నారు. చేయని తప్పునకు పదే పదే క్షమాపణలు చెప్పాలనటం సరైంది కాదు. సీఎం, మంత్రులు అహంకారంతో వ్యవహరిస్తున్నారు. సభ నడుస్తున్న తీరు ప్రజా స్వామ్యానికి పెను ప్రమాదంగా మారింది. ప్రతిపక్షం ఉండకూడదన్న ఉద్దేశంతో 12 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను తెరాసలో కలుపుకొన్నారు. రైతులు, నిరుద్యోగులు, నిత్యావసరాల పెరుగుదలపై మాట్లాడితే సీఎం తట్టుకోలేకపోతున్నారు’’ అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ..ప్రజా సమస్యలపై మాట్లాడనీయకుండా పదే పదే అడ్డుకోవటం సరికాదన్నారు. ప్రజల గొంతు వినిపిస్తుంటే మైక్‌ కట్‌ చేయడం దారుణమన్నారు. సీఎం కేసీఆర్‌ అధికార బలంతో నియంతలా వ్యవహరిస్తున్నారని, సాగర్‌ ఉప ఎన్నికల్లో ప్రజలు బుద్ది చెప్పాలని కోరారు. సంఖ్యా బలంతో సభను సీఎం ఏకపక్షంగా నడిపిస్తున్నారని మరో ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు ఆరోపించారు. సీఎం, మత్రులకు ప్రజా సమస్యలు వినే ఓపిక లేకపోవడం బాధాకరమన్నారు. 45 రోజులు జరగాల్సిన సభను ఆరు రోజులకు కుదించటం సరికాదన్నారు. .

Advertisement

తాజా వార్తలు

Advertisement