Saturday, November 23, 2024

రజనీకాంత్ పార్టీ రద్దు.. నెక్ట్స్ ఏంటి?

తమిళనాడులో సూపర్ స్టార్ రజినీకాంత్ పొలిటికల్ ఎంట్రీ మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. రజనీకాంత్ తన అభిమానులతో భేటీ కావడంతో ఆయన రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారనే ఊహాగానాలు ఊపందకున్నాయి. గతంలో రాజకీయాల్లో వస్తానని తర్వాలో పార్టీ పడతానని అదిగో ఇదిగో అంటూ చెప్పిన తలైవా.. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమయంలో అనూహ్యం రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించారు. అయితే, ఆయన అభిమానులు మాత్రం తలైవా రాజకీయాల్లోకి రావాలంటూ ధర్నాలు, ఆందోళనలు చేశారు. అయితే, ఇప్పుడు ఎన్నికలు అయిపోయాయి. ఇప్పుడు ఎలాంటి ఎన్నికల హాడావిడి లేదు.

అయితే, రజినీకాంత్ సోమవారం తన అభిమాన సంఘానికి చెందిన అన్ని జిల్లాల నాయకులతో సమావేశం కావడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఆయన పొలిటికల్ ఎంట్రీపై చర్చించినట్లు వార్తలు వచ్చాయి. అయితే, రజినీ మాత్రం పొలిటికల్ ఎంట్రీపై ఆసక్తి లేరని తెలుస్తోంది. తాను స్థాపించిన రాజకీయ పార్టీ రజనీ మక్కల్ మంద్రంను మూసేస్తూ నిర్ణయం తీసుకున్నారు. తలైవా మళ్లీ వస్తారని భావించిన అభిమానులకు నిరాశే ఎదురైంది. ఇకపై మక్కల్ మంద్రం… ఓ సాధారణ స్వచ్ఛంద సంస్థలా పనిచేస్తుంది. ఇది ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తుంది అని రజనీకాంత్ సోమవారం ప్రకటించారు. తాను భవిష్యత్తులో రాజకీయాల్లోకి వచ్చే అవకాశం లేదని రజనీకాంత్ స్పష్టం చేశారు. అయితే, పార్టీ ఫ్యాన్స్ క్లబ్‌గా ఉంటుందని రజినీ చెప్పుకొచ్చారు.

తమిళనాడులో పదేళ్ల తర్వాత మళ్లీ అధికారంలోకి వచ్చిన డీఎంకే పార్టీపై ఇప్పట్లో ప్రజా వ్యతిరేకత రాకపోవచ్చు. అంతేకాకుండా పార్టీ పెట్టిన మరో సినీ నటుడు కమల్ హాసన్ కూడా ఘోరంగా ఓడిపోయారు. దీంతో రజనీకాంత్ రాజకీయాల్లో వచ్చే ఆలోచనను విరమించుకున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ రజనీకాంత్ రాజకీయాల్లోకి వచ్చినా… మరో నాలుగేళ్లపాటూ బలమైన ప్రతిపక్షంగా కొనసాగాల్సి ఉంటుంది. అయితే, అనారోగ్య సమస్యలు తలైవాను ఇబ్బంది పడుతోంది. ఈ క్రమంలో పొలిటికల్ ఎంట్రీకి శుభం కార్డ్ వేసి..  సినిమాలు చేస్తూ అభిమానులతో టచ్ లో ఉండేలా ప్లాన్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement