రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్ కి పర్యటన అడుగడుగున రసాభాసగా మారింది. ఇల్లంతకుంట మండల కేంద్రంలో పలు అధికార కార్యక్రమాలకు మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. గత ఎన్నికల్లో మంత్రి కేటీఆర్ తమ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని మండలానికి 30 పడకల ఆసుపత్రి హామీ ఇచ్చి మాట తప్పడని బిజెపి కార్యకర్తలు సెల్ టవర్ ఎక్కి ఫ్లెక్సీ తో నిరసనకు దిగారు. ఇది ఇలా జరుగుతుండగానే కాంగ్రెస్ శ్రేణులు మంత్రి కేటీఆర్ ను అడ్డుకున్నారు. పర్యటనకు ముందే బీజేపీ కార్యకర్తలను అరెస్టు చేసిన పోలీసులు వెంటనే విడుదల చేయాలని బిజెపి నాయకులు డిమాండ్ చేశారు. తమ మండలానికి 30 పడకల ఆసుపత్రి నిధులు ఇవ్వకుండా ఎలా పర్యటన చేస్తాడని బీజేపీ. కాంగ్రెస్ నాయకులు విమర్శించారు.
ఇక ఇల్లంతకుంట మండల కేంద్రంలో రైతు వేదిక వద్ద మంత్రి కేటీఆర్ ను అడ్డుకున్నారు ఏబీవీపీ కార్యకర్తల. ప్రభుత్వం నిరుద్యోగుల కోసం నోటిఫికేషన్ ఇవ్వడం లేదని యువత ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని అడ్డగించారు. వెంటనే నోటిఫికేషన్ వేసి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో ఏబీవీపీ కార్యకర్తలపై టిఆర్ఎస్ కార్యకర్తలు దాడికి దిగారు. ఘటనలో పలువురు ఏబీవీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి.