Tuesday, November 26, 2024

టీఆర్ఎస్ తో కేసీఆర్ తో బంధం తెగినట్లే: ఈటల రాజేంధర్..

మాజీ మంత్రి ఈటల రాజేంధర్ తనకు మంత్రి పదివి పోవడంపై స్పందించారు. తాజా గా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇటర్వూలో టీఆర్ ఎస్ పార్టీతో పాటు సీఎం కేసీఆర్ పై పలు ఆరోపణలు చేసి తెలంగాణ రాజకీయాల్లో వేడిని రగిల్చారు ఈటల రాజేంధర్. తనను కావాలనే పిచ్చి కుక్కను చేసి మంత్రి పదవి తీసేశారని ఆవేదన వ్యక్తం చేశారు ఈటల. ఇదంతా పక్కా ప్లానింగ్ ప్రకారమే జరిగిందన్నారు..22 సంవత్సరాలగా తో ఉన్న అనుబంధాన్ని మరచిపోయారని ఈటల అన్నారు. తనకు ఏనాడు కూడా పదవి విషయంలో స్వేచ్చ లేదని..కనీసం సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ లో కలవాలంటే గేటు ముందు నిల్చోవాల్సిన పరిస్థితి ఉండేదని వాపోయారు. తనకే కాదు చాలా మంది మంత్రులు, ఎమ్మెల్యేల దుస్థితి ఇప్పటికి ఇలానే ఉందని ఆరోపించారు. ప్రగతి భవన్ లో బాతఖాని కొట్టెటొళ్లు ఉంటారని విమర్శించారు. ఇక ఇపుడు జరిగిన పరిణామాలతో తనుకు ముఖ్యమంత్రి కేసీఆర్ తో కాని టీఆర్ ఎస్ పార్గీతో సంబంధం తెగిపోయినట్లేని అన్నారు. కోవిడ్ సంక్షోభం ముగిసిన తర్వాత ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాన్నానారు. తర్వాత ఖచ్చితంగా గెలుస్తానన్నారు. తనను ఓడించడానికి ఎన్ని వందల కోట్లు ఖర్చు చేసిన వెనకడుగు వేసేది లేదన్నారు. గెలిచి తన సత్తా చూపిస్తాన్నారు.

ముఖ్యమంత్రి గారు డిక్టేట్ చేస్తే కలెక్టర్లు సంతకం పెడుతారని అన్నారు.. మంత్రులకు ఏ పని చేయాలన్న స్వేచ్ఛ ఉండదని అన్నారు. కేసీఆర్ ని కలవాలంటే సంతోష్ రావు ని కలవాల్సి వస్తుందని..సీఎం కాలవాలని ఫోన్ చేస్తే ఒక రోజు వెయిట్ చేయాల్సి వచ్చేదని అన్నారు. సీఎం కోసం రోజుల తరబడి వెయిట్ చేయాల్సి వచ్చేది..ఇదంతా సంతోష్ రావు చేస్తాడా లేక పెద్దాయన చెబుతాడో తమకు తెలవదని కాని ఈ పరిణామాలతో తన మనసు గాయపడిందని అన్నారు.

ఇక కోవిడ్ సంక్షోభం పై మాట్లాడిన ఈటల రాజేంధర్.. కరోనా పరిస్థితుల్లో తాను కష్టపడి పనిచేశానన్నారు. అయితే ఇప్పుడు కోవిడ్ ఆరోగ్య శ్రీలో చేర్చాలని తాను సీఎం కేసీఆర్ ను డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు.అంతేకాకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ కోవిడ్ కట్టడిపై ఇప్పుడు పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలని అన్నారు. ఇక కోవిడ్ మొదటి వేవ్ లో మరణాల సంఖ్య ను తక్కువ చేసి చూపారన్న ఆరోపణలపై ఈటల స్పందించారు. ప్రజల్లో భయాందోళనలు కలగకుండా కొంత మేరకు కేసులను తక్కువ చేసి చూపామన్నారు. అయితే వాటికి ఉండాల్సిన కల్యిక్యూలేషన్స్ ఉన్నాయని ఆయన అన్నారు. కోవిడ్ టైం లో హైకోర్టు ప్రభుత్వానికి మొట్టికాయలు వేస్తుందని ఇప్పటికైనా ప్రభుత్వం కోవిడ్ కట్టడికి పకడ్బందీగా చర్యలు చేపట్టాలన్నారు.

ఇక ఉద్యోగులు వయోపరిమితి పెంచడం మాత్రం ముమ్మాటికీ తప్పేనన్నారు ఈటల రాజేంధర్… ఈ నిర్ణయనికి తాను పూర్తిగా వ్యతిరేకమన్నారు.. దీనిపై ఉద్యోగులు కూడా అసంతృప్తిగా ఉన్నారని పేర్కొన్నారు. మంత్రి వర్గంలో బడ్జెట్ ప్రయారటీ ముఖ్యమంత్రి నిర్ణయిస్తారన్న ఈటల కాళేశ్వరానికి ఎక్కువ డబ్బుల పెట్టిన మాట వాస్తవమన్నారు. ఆ సమయంలో వెల్ఫేర్ వర్గాలకు డబ్బుల కొరత ఏర్పడిందన్నారు.
ఇక తెలంగాణలో విద్యా వైద్య వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందన్నారు. ఇప్పటికైనా వీటిని మెరుగు పరచాల్సిన అవసరముందన్నారు. యూనివర్శిటీల్లో పరిస్థితి అద్వానంగా ఉందన్నారు.

కేటీఆర్ కి ముఖ్యమంత్రి పదవి అప్పజెపుతారన్న అంశంపై స్పందించిన ఈటల… ప్రాంతీయ పార్టీలు వంశపారంపర్యంగా నడుస్తాయని దేశవ్యాప్తంగా అన్ని పార్టీలు అలానే నడుస్తున్నాయని అన్నారు. తానుకు కేటీఆర్ ముఖ్యమంత్రి పదవి అప్పజెప్పడం అంగీకరంగానే ఉండేవాడినని తెలిపారు. తనకు కేటీఆర్ తో మంచి సంబంధాలే ఉన్నాయని అన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement