Saturday, November 23, 2024

జాత్యహంకార కామెంట్స్‌ పై స్పందించిన రాజ కుటుంబం

యువరాజు హ్యారీ, మేఘన్ మోర్కెల్ దంపతులు ఇంటర్వ్యూలో తాజా ఇంటర్వ్యూలో వెల్లడించిన విషయాలు యావత్ ప్రపంచాన్ని నివ్వెరపరిచాయి. ఈ వ్యాఖ్యల పట్ల బ్రిటన్‌ రాజకుటుంబంలోను నిప్పురాజేసినట్లయింది. తను జాత్యహంకార వ్యాఖ్యలను ఎదుర్కొన్నట్లు మేఘన్‌ మోర్కెల్‌ చేసిన వ్యాఖ్యలపై తాజాగా , ఎలిజబెత్‌ రాణీ-2 స్పందించారు. జాత్యహంకార వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణిస్తున్నామన్నారు. కొన్ని గుర్తులు చెరిగిపోవచ్చు వాటిని చాలా తీవ్రంగా పరిగణిస్తున్నామన్నారు. వాటిని కుంటుంబంలో చర్చించి పరిష్కారిస్తామన్నారు. హ్యారీ, మేఘన్‌ లను తాము ఎప్పుడు తమ కుటంబ సభ్యులుగా ప్రేమిస్తూనే ఉంటామన్నారు. రాజకుంటుంబంలో ఉన్నప్పుడు తన మనవడు హ్యారీ, ఆయన భార్య గుడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నారన్న ఆమే వారి విషయంలో కుటుంబం మొత్తం బాధపడిందని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement