- 263 గ్రాముల వెండి వస్తువులు,
- రూ. 3500 క్యాష్
- రెండు బైక్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు
- ఆలస్యంగా వెలుగులోకి….
- వివరాలు వెల్లడించిన డీఎస్పీ
తనకల్లు:
అనంతపురం జిల్లా తనకల్లు మండల పరిధి లోని కనసానివారిపల్లె బైరాగి స్వామి గుడిలో జరిగిన ఓ చోరీని పోలీసులు ఛేధించారు. ఇందుకు సంబంధించిన ఆలస్యంగా వెలుగు చూసిన వివరాలు ఇలా ఉన్నాయి…గురువారం స్థానిక పోలీస్స్టేషన్లో విలేకరుల సమావేశంలో డీఎస్పీ భవ్య కిశోర్ మాట్లాడుతూ ఈ చోరీ
తొమ్మిదోతేదీన జరిగిందని తెలిపారు. విచారణ అనంతరం గురువారం ముగ్గురిని అరెస్టు చేశామని ఆమె తెలిపారు.
కొండ వెనక పల్లి చెందిన యానాది ఈశ్వరయ్య, కడప జిల్లాకు చెందిన కొత్త కోటా గంగాధర్ బైరెడ్డి గారిపల్లి గ్రామానికి చెందిన పచ్చ పొలం చిన్న దుండగులను అరెస్టు చేసి చేసినట్లు డిఎస్పి రవికిషోర్ తెలిపారు వారి వద్ద నుండి మోటార్ సైకిళ్లు వెండి వస్తువులను మూడువేల అయిదువందల నగదును రెండు మైకులను ఒక ఇనుప రాడ్లను స్వాధీనం చేసుకున్నట్లు ఆమె తెలిపారు. దేవాలయాల్లో చోరీల నియంత్రణకు సీసీ కెమేరాలు ఏర్పాటు చేసుకోవాలని కోరారు. గ్రామాల్లో అనుమానితులు కనబడితే పోలీసులకు సమాచారం అందించాలన్నారు సమావేశంలో కదిరి రూరల్ సీఐ మధు ఎస్ఐ రాంభూపాల్ ఏఎస్ఐ సూరి పోలీసులు పాల్గొన్నారు.