ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ 2022-2023 అకడమిక్ ఇయర్ గాను ఇంటర్ 1వ & 2వ సంవత్సర పరీక్షను విజయవంతంగా నిర్వహించింది. ఆంధ్రప్రదేశ్ వివిధ పరీక్షా కేంద్రాలలో 15 మార్చి నుండి 4 ఏప్రిల్ 2023 వరకు ఇంటర్మీడియట్ 1వ & 2వ సంవత్సర పరీక్షను నిర్వహించింది. కాగా, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ బోర్డ్ తాజాగా.. 2023AP ఇంటర్మీడియట్ ఫలితాలు రిలీజ్ అయ్యే తేదీ, సమయాన్ని ప్రకటించింది.
ఇంటర్ 2వ సంవత్సర ఫలితాలను రేపు (ఏప్రిల్ 26) మనబడి వెబ్ సైట్ లో అందుబాటులో ఉండనున్నాయి. ఇంటర్ 1వ సంవత్సరం ఫలితాలను ఏప్రిల్ 29న ప్రకటించనుంది. విద్యార్థులు తమ లాగిన్ ఆధారాలను ఉపయోగించి అధికారిక వెబ్‌సైట్ నుండి BIEAP ఇంటర్ 1వ, 2వ సంవత్సర ఫలితాలను చెక్ చేయవచ్చు.
అభ్యర్థులు bieap.apcfss.in, bie.ap.gov.in, results.bie.ap.gov.in , మనబడి పోర్టల్‌లోని అధికారిక వెబ్‌సైట్ నుండి ఫలితాలు తనిఖీ చేయవచ్చు. మీరు క్రింద పేర్కొన్న AP ఇంటర్ 2వ సంవత్సర ఫలితాలు 2023 గురించిన పూర్తి సమాచారాన్ని తనిఖీ చేయవచ్చు. విద్యార్థులు ఫ్యూచర్ కోసం ఇంటర్ 1వ & 2వ సంవత్సరం పరీక్షా ఫలితాల ప్రింటవుట్ తీసుకోవచ్చు.