అమరావతి, : కేంద్ర పరిధిలోని పలు ప్రభుత్వరంగ సంస్థ లను ముందుకు నడిపించలేక కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ రంగం వైపు మొగ్గు చూపుతోంది. ఆ దిశగానే విశాఖ ఉక్కు కర్మాగారాన్ని అమ్మేయాలని నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో ఉన్న సంస్థ లను కూడా ప్రైవేట్‌పరం చేయాలని యోచిస్తోంది. అయితే అదే విధానాన్ని దేశంలోని ఆయా రాష్ట్రాలు కూడా అనుసరించాలని కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తోంది. రాష్ట్రంలోని పలు ప్రభుత్వరంగ సంస్థ లను ప్రైవేట్‌పరం చేసి వచ్చిన సొమ్ముతో అభివృద్ది కార్యక్రమాలను నిర్వహించుకోవా లని సూచిస్తోంది. కేంద్ర పరిధిలో పనిచేసే నీతిఆయోగ్ కూడా ఆ తరహా నివేదికనే కేంద్రానికి సమర్పించింది. ఈ ప్రక్రియలో భాగంగానే ఆస్తులను అమ్ముకుని పెట్టుబడులు సమీకరించుకోవ డానికి మంగళవారం జాతీయ స్థాయిలో వర్క్‌షాప్‌ను నిర్వహిం చడానికి ఏర్పాట్లను సిద్దం చేస్తోంది. అయితే లోటుబడ్జెట్‌లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్‌పరం వైపు మొగ్గుచూపే ఆలోచనలో లేక పోయినప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లో నిరుపయో గంగా ఉన్న ప్రభుత్వ ఆస్తులను విక్రయించాలని నిర్ణయం తీసుకున్న విష యం తెలిసిందే. అయితే కేంద్రం ఒత్తిడితో రాష్ట్ర పరిధిలోని పలు వ్యవస్థ లను ప్రైవేట్‌పరం చేస్తుందా.. లేక నష్టాలైనా భరిస్తూ ప్రభుత్వ ఆధీ నంలోనే వాటిని నెట్టుకొస్తుందా.. వేచి చూడా ల్సిందే. సీఎం జగన్ మాత్రం అభివృద్ది, సంక్షెమం రెండు కళ్లులా భావిస్తూ రాష్ట్ర ప్రజలకు పా దయాత్రలో ఇచ్చిన హామీ మేరకు నవరత్నాల ఫలాలను అందిస్తూ వస్తున్నారు. అయితే అం దుకు ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదురవుతు న్నాయి. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు సకాలంలో అందడం లేదు. ప్రత్యే కంగా పేదల సహకారం కూడా పూర్తి స్థాయిలో లభించడం లేదు. ఇటువంటి పరిస్థి తుల్లో నిరు పయోగంగా ఉన్న ఆస్తులను అమ్మి అభివృద్ది కార్యక్రమాలు చేపట్టడంలో తప్పేమీ లేదని ప్రభుత్వం భావిస్తూ ఆ దిశగానే ఏళ్ల తరబడి నిరుపయోగంగా ఉన్న విలువైన ప్రభుత్వ ఆస్తులను అమ్మకానికి పెడుతోంది. మరి కేం ద్రం సూచించిన విధంగా ఆయా వ్యవస్థ లను ప్రైవేట్‌పరం చేస్తుందో లేదో చూడాల్సి ఉంది.
9న సదస్సు :
జాతీయ స్థాయిలో వివిధ వ్యవస్థ లను విక్రయించేందుకు అనుసరించా ల్సిన విధివిధానా లపై చర్చించేందుకు ఈ నెల 9వ తేది కేంద్రప్రభుత్వం వర్క్‌షాప్‌ను నిర్వ హించాలని నిర్ణయం తీసుకుంది. ఆన్‌లైన్ ద్వా రా నిర్వహించే ఈ సద స్సులో దేశంలోని అన్నీ రాష్ట్రాలు పాల్గొనాలని సూచించింది. అందు లో భాగంగా రాష్ట్రానికి కూడా ఆహ్వానం అం దింది.
కేంద్రం సూచించిన వ్యవస్థ లివే
రాష్ట్ర పరిధిలోని వివిధ వ్యవస్థలను అమ్ముకోవడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇవ్వడానికి అవసరమైన అన్నీఏర్పాట్లు చేస్తోంది. ఆ దిశగానే నీతిఆయోగ్ కూడా ఆ వివరాలను వెల్లడించింది. కేంద్ర నివేదిక ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.. రాష్ట్రంలోని ఎక్స్‌ప్రెస్ రహదారులు, రాష్ట్ర రహదారులు, విద్యుత్ జనరేషన్ యూనిట్లు, విద్యుత్ పంపిణీ వ్యవస్థ లు, రాష్ట్ర పరిధిలో ఉండే విమానాశ్రయాలు, నౌకా కేంద్రాలు, లాజిస్టి క్ పార్కులు, బస్ టెర్మినల్స్, క్రీడా మైదానాలు.. వీటితో పాటు క్రమం తప్పకుండా ఆదాయాలను అందించే పలు వ్యవ స్థ లను కూడా విక్రయించాలని సూచించింది.