Tuesday, November 26, 2024

ఆస్కార్‌ బరిలో కూళంగల్‌ నయనతార నిర్మించిన చిత్రమిది

అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిం చే 2022 ఆస్కార్‌ పోటీలకు భారతదేశం తరుపున ‘కూళంగల్‌’ (తమిళ సినిమా) ఎంపికైంది. ఈ విషయాన్ని ఆస్కార్‌ సెలక్షన్‌ కమిటీ చైర్‌ పర్సన్‌ షాజీ ఎన్‌. కరుణ్‌ వెల్లడించారు. ‘కూళంగల్‌’ చిత్రా న్ని ఏకగ్రీవంగా ఎంపిక చేసినట్టుగా ఎఫ్‌ఎఫ్‌ఐ సెక్రటరి సుప్రాన్‌ సెన్‌ తెలిపారు.
2022లో జరిగే 94వ ఆస్కార్‌ పోటీలకు ‘కూళంగల్‌’ (పెబెల్స్‌) చిత్రం ఎంపిక విషయం తెలియడంతో చిత్ర నిర్మాత నటి నయనతార, ఆమె కాబో య్‌ భర్త విఘ్నేశ్‌ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ”ఆస్కార్‌ గెలిచేందుకు కేవలం రెండు మెట్ల దూరంలో ఉన్నాం” అంటూ విఘ్నేష్‌ ట్వీట్‌ చేశారు. భారత్‌ నుండి ఆస్కార్‌ పోటీకి 14 చిత్రాలు పోటీపడ్డాయి. వీటిలో ‘సర్దార్‌ ఉదమ్‌’, ‘షేర్నీ’, ‘మండేలా’ గట్టిపోటీని ఇచ్చి నట్టు తెలిసింది. కూళంగల్‌ దర్శకుడు పీఎస్‌. వినోద్‌ రాజ్‌ తొలి చిత్రం కావడం విశేషం. తన కుటుంబంలో జరిగిన ఓ యదార్థ జీవిత ఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఇది తండ్రీకొడుకుల కథ. తాగుబోతు తండ్రి వేధింపులు భరించలేని తల్లి ఇంటి నుండి వెళ్లిపోతుంది. ఆమెను తిరిగి వెనక్కి తీసుకు వచ్చారనేది చిత్ర కథాంశం. ఈ చిత్రాన్ని రౌడీ పిక్చర్స్‌ పతాకంపై నయనతార, విఘ్నేశ్‌ నిర్మిం చారు. ఇప్పటికే ఈ సినిమాలు పలు పురస్కారాలు లభించాయి. ఆస్కార్‌ అవార్డుల ప్రదానం వచ్చే ఏడాది మార్చి 22న అమెరికా లాస్‌ ఏంజెల్స్‌లో జరుగుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement