యోగా గురువుకు ఉగాది పురస్కారం..

యోగా గురువుకు ఉగాది పురస్కారం..

ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ : యోగా – సేవా విభాగంలో కొండపల్లి పట్టణంలోని ఫెర్రీకి చెందిన యోగా గురువు లంకె జనార్దన్ కు శ్రీ పరాభవ నామ సంవత్సర ప్రతిష్ఠాత్మక ఉగాది పురస్కారం – 2026 లభించింది. విజయవాడ తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రంలో జరిగిన ప్రత్యేక ఉగాది పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పురస్కారాన్ని అందజేశారు.

కొన్నేళ్ల నుంచి లంకె జనార్దన్ వృత్తి, ప్రవృత్తిగా యోగాను ఎంపిక చేసుకుని విశిష్ట సేవలు అందిస్తున్నారు. యోగాంధ్ర కార్యక్రమంలో విశేషంగా పని చేయడమే కాకుండా వివిధ ప్రాంతాల్లో ప్రత్యేక యోగా శిబిరాలు నిర్వహించి యోగాలో వేర్వేరు విభాగాల్లో శిక్షణ ఇస్తున్నారు. ధ్యాన, సూర్య నమస్కార సప్తాహాలు, యోగా మాసోత్సవాలు నిర్వహిస్తున్నారు.

Leave a Reply