Uae-Deputy-Pm-Praise : బహుత్ షుక్రియా Andhra Prabha Top News

Uae-Deputy-Pm-Praise : బహుత్ షుక్రియా Andhra Prabha Top News

  • సూప‌ర్ బ్రేవ్‌..!
  • యూఏఈ గ‌ర్విస్తోంది
  • కాక్‌పిట్‌ హీరోకు UAE డిప్యూటీ ప్రధాని ప్రశంసలు..!
  • ఫ్లై దుబాయ్ పైలట్‌ స్మిత్‌ మచ్చర్‌కు షేక్‌ హమ్దాన్‌ అభినందనలు
  • ప్రాణాలను కాపాడిన ధైర్యానికి ప్రశంసలు

( అబుదాబి, ఆంధ్రప్రభ ప్రతినిధి)

కాక్‌పిట్‌లో కో-పైలట్‌ గొడ్డలితో దాడి చేసినా.. ప్రయాణికుల ప్రాణాలను కాపాడేందుకు అసాధారణ ధైర్యసాహసాలు ప్రదర్శించిన భారత పైలట్‌ స్మిత్‌ మచ్చర్‌కు యూఏఈ నాయకత్వం అండగా నిలిచింది. యూఏఈ ఉప ప్రధాని, దుబాయ్‌ క్రౌన్‌ ప్రిన్స్‌ షేక్‌ హమ్దాన్‌ బిన్‌ మహ్మద్‌ అల్‌ మక్తూమ్‌ శనివారం అబుదాబిలో చికిత్స పొందుతున్న స్మిత్‌ను స్వయంగా పరామర్శించారు. ఆయన ధైర్యాన్ని ప్రత్యేకంగా ప్రశంసించారు.
స్మిత్‌ మచ్చర్‌ ప్రదర్శించిన తెగువ, బాధ్యత, మానవ ప్రాణాల పట్ల చూపిన శ్రద్ధ అత్యున్నత స్థాయిలో ఉన్నాయని షేక్‌ హమ్దాన్‌ పేర్కొన్నారు. ఈ సందర్భంగా యూఏఈ నాయకత్వం తరఫున ఆయనకు అభినందనలు, కృతజ్ఞతలు తెలిపారు.

‘మా దేశం తరఫున గర్విస్తున్నాం’

స్మిత్‌ మచ్చర్‌ తమ బృందంలో ఒక భాగమని, తమ దేశ కథలోనూ ఆయనకు ప్రత్యేక స్థానం ఉందని షేక్‌ హమ్దాన్‌ పేర్కొన్నారు. కరుణ, శాంతి, మానవ జీవితం పట్ల గౌరవం వంటి విలువలకు యూఏఈ ప్రతీకగా నిలుస్తుందని, వాటిని స్మిత్‌ తన చర్యల ద్వారా ప్రతిబింబించారని తెలిపారు.

మోదీతో స్మిత్ మాటామంతీ

పైలట్‌ సాహసాన్ని ప్రధాని నరేంద్ర మోదీ కూడా ప్రశంసించారు. స్మిత్‌ మచ్చర్‌ పట్ల యావత్‌ భారతదేశం గర్విస్తోందని పేర్కొన్నారు. ‘ప్రాణాలు తీసేవాళ్లం కాదు.. ప్రాణాలు కాపాడేవాళ్లం’ అంటూ మోదీ చేసిన వ్యాఖ్యలు స్మిత్‌కు ధైర్యాన్ని ఇచ్చాయి. ప్రధానితో మాట్లాడిన సమయంలో స్మిత్‌ భావోద్వేగానికి గురయ్యారు. మోదీ తనకు అత్యంత ఇష్టమైన వ్యక్తి, ఆదర్శమని చెప్పారు. ఆయనతో మాట్లాడే అవకాశం తనకు లభిస్తుందని ఎప్పుడూ ఊహించలేదని తెలిపారు.

కష్టాల్లో హనుమాన్‌ చాలీసా..

దాడి సమయంలో తాను హనుమాన్‌ చాలీసా పఠించినట్లు స్మిత్‌ వెల్లడించారు. తాను ఎప్పుడు కష్టాల్లో ఉన్నా హనుమాన్‌ చాలీసా చదవడం అలవాటని, ఆ సమయంలోనూ అదే చేశానని చెప్పారు. ప్రస్తుతం అబుదాబిలో చికిత్స పొందుతున్న స్మిత్‌ మచ్చర్‌ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతున్నట్లు సమాచారం. మరోవైపు విమానంలో జరిగిన దాడికి సంబంధించి యూఏఈ అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఒకవైపు కాక్‌పిట్‌లో ప్రాణాంతక దాడి.. మరోవైపు 174 మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడేందుకు భారత పైలట్‌ పోరాటం.. ఈ ఘటన అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారిం