South Africa | 21 మంది మృతి…

రెండు మినీ బస్సుల ఢీ..
ఆపై దూసుకొచ్చిన ఎస్‌యూవీ


South Africa | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : దక్షిణాఫ్రికాలోని వెస్టర్న్‌ కేప్‌ ప్రావిన్స్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రిన్స్‌ ఆల్బర్ట్‌-లీయు గామ్కా హైవేపై రెండు మినీ బస్సులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదం జరిగిన వెంటనే మరో ఎస్‌యూవీ అదుపుతప్పి బస్సులపైకి దూసుకెళ్లింది. దీంతో భారీ ప్రమాదం సంభవించింది.

ఈ ఘటనలో 21 మంది మృతి చెందగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఘటనాస్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.