Breaking News | రైలు కింద పడి ఇద్దరు పిల్లలు, తల్లి ఆత్మహత్య…
Breaking News | రైలు కింద పడి ఇద్దరు పిల్లలు, తల్లి ఆత్మహత్య…
Breaking News | అనంతపురం, ఆంధ్రప్రభ : అనంతపురం జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని యాడికి మండలం వేములపాడులో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. అయితే ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది…
ఈ ఘటనలో తల్లి, ఓ కుమార్తె స్పాట్లోనే మృతి చెందగా.. మరో చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. చిన్నారిని రాయలచెరువు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం అనంతపురం తరలిస్తుండగా ఆ చిన్నారి కూడా మృతి చెందింది.
