రెండు బైకులు ఢీకొని…

చేవెళ్ల, ఆంధ్రప్రభ : చేవెళ్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని కమ్మెట స్టేజీ వద్ద రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న దుర్ఘ‌ట‌న‌తో కమ్మెట గ్రామానికి చెందిన దుబ్బలి శ్రీనివాస్ (Dubballi Srinivas)(35) దుర్మ‌ర‌ణం పాల‌య్యాడు. క‌మ్మెట నుంచి ఎన్‌కేప‌ల్లి వైపు వెళుతున్న శ్రీ‌నివాస్ బైక్‌ను, శంకరపల్లి నుంచి మరో ద్విచక్ర వాహనం చేవెళ్ల వైపు వ‌స్తున్న బైక్ ఢీకొంది.

ఈ ప్రమాదంలో దుబ్బలి శ్రీనివాస్ కు తీవ్ర రక్త గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. మరో బైక్ పై ఉన్న ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. పోస్టుమార్టం నిమిత్తం శ్రీనివాస్ మృత‌దేహాన్ని చేవెళ్ల (Chevella) ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడికి భార్య విజయ ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ భూపాల్ శ్రీధర్ వెల్లడించారు.

Leave a Reply