tvk108 | ఎమ్మెల్యేల్ని కాడుకునేందుకు టీవీకే యత్నాలు
tvk108 | ఎమ్మెల్యేల్ని కాడుకునేందుకు టీవీకే యత్నాలు
tvk108 | 108 స్థానాల్లో గెలుపొందింన వియజ్ పార్టీ
డీఎంకే కూటమికి 73, అన్నాడీఎంకే కూటమికి 53 సీట్లు
చిన్నపార్టీల సాయంతో గట్టెక్కేందుకు దళపతి స్కెచ్
మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా పీఎంకే, ఐయూఎంఎల్, సీపీఐ, వీసీకే, సీపీఎం
12 సీట్ల సపోర్టుతో ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమం
గవర్నర్‌కు 10 రోజుల గడువు కోరుతూ విజయ్ లేఖ
tvk108 | సెంట్రల్ డెస్క్, ఆంధ్రప్రభ : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో హంగ్ వచ్చింది. ఏ పార్టీకి, కూటమికిగానీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత సాధారణ మెజార్టీ రాలేదు. అయితే.. తొలిసారి ఎన్నికల్లో పోటీచేసిన టీవీకే అధినేత విజయ్ పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. విజయ్ పార్టీ తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలను కైవసం చేసుకుని భారీ విజయాన్ని నమోదు చేసింది. అన్నాడీఎంకే కూటమి 53 సీట్లు, డీఎంకే కూటమి 73 సీట్లు నెగ్గాయి. ఈ క్రమంలో తమ ఎమ్మెల్యేలను రక్షించుకునేందుకు టీవీకే అధినేత విజయ్ రిసార్ట్ రాజకీయాలు మొదలుపెట్టారు. పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకునేందకు రిసార్ట్ వేటలో పడినట్లు తెలుస్తోంది.
తమిళనాడు ఎన్నికల ఫలితాలు
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఏప్రిల్ 23న ఒకే దేశలో మొత్తం 234 అసెంబ్లీ స్థానాలకు జరిగాయి. మే 4న ఎన్నికల కమిషన్ కేరళం, అస్సాం, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరిలతో పాటు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడించింది. తమిళనాడులో అంతా డీఎంకేదే అధికారమని ఫిక్సయ్యారు. ఎగ్జిట్ పోల్స్ అలాగే వచ్చాయి. కానీ అనూహ్యంగా విజయ్ నేతృత్వంలోని టీవీకే వందకు పైగా స్థానాల్లో విజయం సాధించింది.
రిసార్ట్ వేటలో టీవీకే?
తమిళనాడులో ఏ పార్టీకి మెజారిటీ రాకపోవడంతో అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకే అధినేత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. అయితే.. ప్రభుత్వం ఏర్పాటు చేసే వరకు పార్టీ ఎమ్మెల్యేల్ని సురక్షితంగా ఉంచడానికి కూవత్తూరు తరహాలో రిసార్ట్ రాజకీయాలు మొదలెట్టినట్టు తెలుస్తోంది. ఎన్నికల్లో గెలిచిన వారు తన పనయూర్ నివాసానికి రావాలని ఓట్ల లెక్కింపునకు ఒక రోజు ముందే పార్టీ అభ్యర్థులను విజయ్ ఆదేశించారు. ఏ పార్టీకి, కూటమికి మెజార్టీ రాకపోవడంతో ఏ క్షణాన ఏమైనా జరగొచ్చని విజయ్ ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. తమ పార్టీ ఎమ్మెల్యేలను ఇతర పార్టీలు ప్రలోభపెట్టడం, భయపెట్టడం, కిడ్నాప్ లాంటి డ్రామాలు లేకుండా చూడటంలో భాగంగా అందర్నీ రిసార్ట్‌కు తరలించినట్టు తెలుస్తోంది.
ఇతర పార్టీల మద్దతుతో..
కాగా, పీఎంకే (4), ఐయూఎంఎల్ (2), సీపీఐ (2), వీసీకే (2), సీపీఎం (2) మద్దతు కనుక విజయ్‌కి లభిస్తే మరో 12 సీట్లు అవుతాయి. దాంతో కాంగ్రెస్, బీజేపీ మద్దతు లేకుండానే విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని పొలిటికల్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు. కాగా, తమిళనాడు గవర్నర్‌కు 10 రోజుల గడువు కోరుతూ టీవీకే అధినేత విజయ్ లేఖ రాశారు. ప్రభుత్వ ఏర్పాటుకు సమయం కావాలని ఆ లేఖలో దళపతి స్పష్టం చేశారు.
పార్టీల బలాబలాలు:
టీవీకే: 108 స్థానాల్లో విజయం సాధించింది. ఇందులో విజయ్ రెండు చోట్ల విజయం గెలుపొందగా.. ఒక స్థానానికి రాజీనామా చేస్తే టీవీకేకు మొత్తం 107 స్థానాలు ఉంటాయి.
డీఎంకే : స్టాలిన్‌కు చెందిన ఈ కూటమి మొత్తం 73 స్థానాల్లో విజయం సాధించింది. అందులో కాంగ్రెస్ 5 స్థానాల్లో గెలుపొందింది.
అన్నాడీఎంకే : మూడో స్థానానికి పరిమితమైన ఈ కూటమి 53 స్థానాల్లో నెగ్గింది. కూటమిలో ఉన్న పీఎంకే పార్టీ 4 చోట్ల విజయం సాధించింది.
ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్: 2 స్థానాల్లో గెలుపొందింది..
సీపీఐ : 2 స్థానాల్లో విజయం.
సీపీఎం : 2 స్థానాల్లో విజయం.
వీసీకే: 2 స్థానాల్లో విజయం.
బీజేపీ: 1 స్థానంలో విజయం.
డీఎండీకే : 1 స్థానంలో విజయం.
ఏఎంఎంకే : 1 స్థానంలో విజయం.
