ఐటీ..ఫార్మా కంపెనీల్లో అలజడి
- సోలార్ సంస్థలకు శుభసూచకం
- ప్లాట్ గా.. అటు ఇటూ స్టాక్ మార్కెట్ షురూ
(ఆంధ్రప్రభ, బిజినెస్ డెస్క్) : ఇండియన్ స్టాక్ మార్కెట్ ఈ రోజు ఫ్లాట్‌గా ప్రారంభమైంది. ఆర్బీఐ మోనిటరీ పాలసీ కమిటీ (MPC) మీటింగ్ లో వచ్చే నిర్ణయాలకు అనుగుణంగా .. మదుపర్లు ముందు జాగ్రత్తలు తీసుకుంటున్న స్థితిలో.. గత కొన్ని రోజుల్లో మార్కెట్ డౌన్ ఫాలింగ్ లో ఉంది. ఫారిన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు ( FII ) తమ షేర్ల అమ్మకాల జోరు పెంచంటంతో మార్కెట్ చతికిల పడింది. ఈరోజు సోమవారం మార్కెట్ సెంటిమెంట్ కు అనుగుణంగా సానుకూలంగా కనిపిస్తోంది, ఎందుకంటే NSEలో 1,987 స్టాక్‌లు పైకి (అడ్వాన్స్‌లు) 753 మాత్రమే కిందకు (డిక్లైన్‌లు) వచ్చాయి. యథా ప్రకారం ఈ రోజు కూడా ఐటీ, ఫార్మా కంపెనీల్లో అలజడి తప్పటం లేదు. ఇక సోలార్ సెక్టార్ పై మదుపర్లు మక్కువ చూపిస్తున్న వైనం కనిపిస్తోంది.
సెప్టెంబర్ 26 న – 24,654.70 పాయింట్లతో Nifty 50 ముగిసింది. ఈరోజు 24,800 స్థాయిలో ఫ్లాట్ ఓపెనింగ్ అవుతుందని మదుపర్లు ఆశిస్తున్నారు. ప్రీ-ఓపెన్‌లో ఫార్మా, ఐటీ సెక్టర్లు ఒత్తిడిలో ఉన్నాయి. సెప్టెంబర్ 26న 80,426 పాయింట్లకు ( 0.90%) తగ్గింది. గత వారంలో మొత్తం 700 పాయింట్లు (-0.87%) కోల్పోయింది. మార్కెట్ క్యాప్ ₹447.23 లక్షల కోట్లు (USD 5.04 ట్రిలియన్) నష్టపోయింది. గత వారం Nifty 24,700 పాయింట్ల కంటే కిందకు జారింది, Sensex 6% ఇయర్ -టు- డేట్ లాస్ కనిపించింది. సెప్టెంబర్‌లో ₹19,500 కోట్ల మేరకు FIIలు అమ్మకాలు చేశారు.
(మొత్తం ₹1,44,085 కోట్లు YTD), DIIలు (డొమెస్టిక్ ఇన్‌వెస్టర్లు) ₹17,500 కోట్లు కొనుగోళ్లు చేశారు. ఇక రూపాయి విలువ రికార్డు స్థాయిలో 88.75కు బలహీనపడింది. ఈ కింది అంశాలే తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. US ట్రేడ్ టెన్షన్స్, ఫార్మా టారిఫ్‌లు, H-1B వీసా ఫీలు ₹100,000కు పెంచటం, TCS, Infosys తదితర IT, ఫార్మా స్టాక్‌లు ఒత్తిడిలో ఉక్కిరి బిక్కిరి కావటం, ఇక RBI రెపో రేట్ కట్ పై మదుపర్లు ఆశలు పెట్టుకున్నారు. కానీ సెరుగుతున్న ద్రవ్యోల్బణంపై ఆందోళన చెందుతున్నారు. బ్యాంక్ నిఫ్టీ 1.07% (-586 పాయింట్లు) కిందకు. మెటల్, FMCG స్ట్రాంగ్, టెక్/ఫార్మా సెక్టార్లు బలహీనపడ్డాయి. ఈ రోజు మార్కెట్ టర్నోవర్ ₹19,629 కోట్లు. 54 స్టాక్‌లు అప్పర్ సర్క్యూట్, 47 స్టాక్ లు లోయర్ సర్క్యూట్ లో ఉన్నాయి. సోలార్ (Websol Energy) స్టాక్‌లు పాజిటివ్ రేంజీలో ఉన్నాయి.

