కరువు పరిస్థితులను పరిశీలించిన కేంద్ర బృందం

ఖరీఫ్ పంటలను పరిశీలించి రైతుల సమస్యలపై ఆరా

కర్నూలు జిల్లాలో కేంద్ర కరువు బృందం పర్యటన

ఖరీఫ్‌ పంట నష్టాలపై క్షేత్రస్థాయిలో పరిశీలన

కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : ఖరీఫ్‌–2026 సీజన్‌లో నెలకొన్న కరువు పరిస్థితులు, పంట నష్టాలను క్షేత్రస్థాయిలో అంచనా వేసేందుకు కేంద్ర బృందం కర్నూలు జిల్లాలో పర్యటించింది. ఇందులో భాగంగా తుగ్గలి మండలం యర్రగుడి పంచాయతీ పరిధిలోని చెరువు తండాలో ఉన్న పెద్ద చెరువును బృందం సందర్శించింది.

కేంద్ర బృందానికి డాక్టర్ కె. పొన్నుసామి, డైరెక్టర్, డైరెక్టరేట్ ఆఫ్ ఆయిల్ సీడ్స్ డెవలప్‌మెంట్, భారత ప్రభుత్వం నాయకత్వం వహించారు. రాష్ట్ర నోడల్ అధికారిగా టీమ్ లీడర్ ఎం. వేణుగోపాల్ రెడ్డి, ఐఏఎస్, డైరెక్టర్, డబ్ల్యూసీడీఎం వ్యవహరించారు. బృంద సభ్యులుగా నీతి ఆయోగ్ సీనియర్ రీసెర్చ్ ఆఫీసర్ అనురాధ బటానా, ఆర్‌ఐసీ, ఎన్‌పీఎంయూ-పీహెచ్‌ఈకు చెందిన ధీరేంద్ర కుమార్, కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ అండర్ సెక్రటరీ ప్రదీప్ కుమార్, కేంద్ర పశుసంవర్ధక, పాడిపరిశ్రమ శాఖ లైవ్‌స్టాక్ ఆఫీసర్ డాక్టర్ సాక్షి భదౌరియా, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

తుగ్గలి, ఆంధ్రప్రభ : మండలంలో నెలకొన్న కరువు పరిస్థితులను అంచనా వేసేందుకు కేంద్ర బృందం అధికారులు సోమవారం తుగ్గలి మండలంలోని జి. ఎర్రగుడి గ్రామంలో పర్యటించారు. అనంతపురం జిల్లా నుంచి కర్నూలు జిల్లాలోకి ప్రవేశించిన కేంద్ర బృందం అధికారులకు తహసీల్దార్ ఎస్. రవి, మండల వ్యవసాయ అధికారి సురేష్ బాబు స్వాగతం పలికారు. కేంద్ర బృందంలోని చిన్మయి, గాడ్‌మెర్, ప్రభాకాంతి, వినోద్ సమంత, సతీష్ సీమకుర్తి తదితర అధికారులు జిల్లా అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించి ఖరీఫ్ సీజన్‌లో రైతులు సాగుచేసిన పంటలను పరిశీలించారు.

కరువు పరిస్థితులను వివరించిన రైతులు

ఈ సందర్భంగా స్థానిక రైతులతో కేంద్ర బృందం అధికారులు మాట్లాడి పంటల సాగు పరిస్థితులు, వర్షాభావ ప్రభావం, దిగుబడిపై ఆరా తీశారు. మండలంలో నెలకొన్న కరువు పరిస్థితులు, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివిధ రాజకీయ పార్టీల నాయకులు, రైతులు కేంద్ర బృందం దృష్టికి తీసుకెళ్లారు. క్షేత్రస్థాయిలో పంటలను పరిశీలించిన అధికారులు వ్యవసాయ పరిస్థితులను అంచనా వేశారు.

ఈ పర్యటనలో జిల్లా వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ వరలక్ష్మి, డ్వామా జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ ఐ. నరసింహారెడ్డి, ఆర్డీవో ఓబులేసు, పశుసంవర్ధక శాఖ జిల్లా జాయింట్ డైరెక్టర్ డాక్టర్ రాజశేఖర్, డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ మల్దన్, తహసీల్దార్ రవి, వ్యవసాయ అధికారి సురేష్ బాబు, దాసరి మునెమ్మ, పశువైద్యాధికారి డాక్టర్ బాలకృష్ణ, ఏపీవో హేమసుందర్, ఆర్ఐ వెంకటరాముడు, మండల సర్వేయర్ సుధాకర్, వీఆర్వో రంగన్న, ఏఈవోలు లక్ష్మీనారాయణ, బాల సరస్వతి, విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ లోహిత్, డ్వామా పత్తికొండ క్లస్టర్ టెక్నికల్ అసిస్టెంట్ చిన్న ఎంకప్ప, టీఏ రామకృష్ణ తదితర అధికారులు పాల్గొన్నారు. అలాగే సీపీఐ నాయకులు నబీ రసూల్, సుల్తాన్, టీడీపీ నాయకులు చంద్రశేఖర్ యాదవ్, వైఎస్సార్‌సీపీ నాయకులు నారాయణ నాయక్‌తో పాటు వివిధ రాజకీయ పార్టీల నాయకులు, రైతులు పాల్గొన్నారు.