AP | అలిపిరి మార్గంలో ఆంక్షలు..
తిరుమలలో చిరుతపులి సంచరిస్తున్న నేపథ్యంలో టీటీడీ అప్రమత్తమైంది. ఈ క్రమంలో శ్రీవారి దర్శనం కోసం అలిపిరి మెట్ల మీదుగా వెళ్లే భక్తుల రక్షణ కోసం టీటీడీ కొన్ని ఆంక్షలు విధించింది.
తిరుమలకు నడక మార్గంలో వెళ్లే భక్తులను ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు అనుమతిస్తోంది. 12 ఏళ్లలోపు చిన్నారులను మధ్యాహ్నం నుంచి అనుమతించడం లేదు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత 70-100 మందితో గుంపులుగా వెళ్లేలా చర్యలు చేపట్టారు. మధ్యాహ్నం 12 ఏళ్లలోపు చిన్నారులకు అనుమతి లేదని టీటీడీ స్పష్టం చేసింది. ఇక రాత్రి 9.30 గంటలకు అలిపిరి మార్గం మూసివేస్తున్నారు.