Sunday, November 24, 2024

కెసిఆర్ హయాంలో జిల్లాకో మెడికల్ కాలేజ్ : ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు

బోథ్ జూన్ ప్రభ న్యూస్- తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సావాలలో భాగంగా మండల కేంద్రంలోని ప్రైవేట్ జిన్నింగ్ మిల్ హల్ లో జరిగిన వైద్యారోగ్య దినోత్సవ వేడుకలకు బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు ముందుగా వైద్యారోగ్య కరపత్రాన్ని ఆవిష్కరించి పలువురు లబ్ధిదారులకు న్యూట్రిషన్ కిట్ లను, కంటి వెలుగులో పరీక్షించుకున్న వారికి అద్దాలను, అంగన్ వాడి ఆయాలకు చీరలను, బిపి కిట్ లను లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం సభలో బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు మాట్లాడుతూ తెలంగాణలో కెసిఆర్ హయాంలో 33 జిల్లాలలో 33 మెడికల్ కాలేజీలు నిర్మిస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ గారిదన్నారు. పల్లె, పల్లెకు వైద్యం అందిస్తున్నమన్నారు. ప్రజల వద్దకే వైద్యం చేరిందని, కంటి వెలుగు లాంటి పలు సంక్షేమ పథకాలు ప్రజలకు ఎంతో లాభాన్ని చేకూర్తున్నాయని అన్నారు.

అంతకుముందు జిల్లా డిప్యూటీ డిఎం అండ్ హెచ్ఓ డా. సాధన నియోజకవర్గంలోని జరిగిన పలు వైద్యాభివృద్ధి పథకాలు, నూతనంగా నిర్మిస్తున్న ఆసుపత్రుల వివరాలు, ఆస్పత్రిలో మెయింటెనెన్స్ కొరకు ప్రభుత్వం విడుదల చేసిన బడ్జెట్ వివరాలు, ప్రజలకు అందిస్తున్న వైద్య సహాయం గురించి వివరించారు.బోథ్ ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ ప్రసాద్ బోత్ సిహెచ్సిలో ఇప్పటివరకు 282 కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు, 748 ఆరోగ్యశ్రీ చికిత్సలు, నూతనంగా ఏర్పాటు చేసిన స్కానింగ్ సెంటర్ ద్వారా 1172 గర్భిణీ స్త్రీలకు స్కానింగ్ పరీక్షలు, 7500 మందికి రక్త పరీక్షలు, 186 మందికి శవపరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో జడ్పిటిసి సంధ్యారాణి, సర్పంచ్ సురేందర్ యాదవ్, ఎఎంసి చైర్మన్ రుక్మన్ సింగ్, బిఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఎలుక రాజు, నాయకులు ఎ లింబాజి, తాహెర్, నారాయణరెడ్డి, జగన్ రెడ్డి, సుభాష్,రమణ, సదానందం, గంగాధర్, తదితర నాయకులు, వైద్యారోగ్య శాఖ సిబ్బంది, ఆశా కార్యకర్తలు, పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement