Friday, November 22, 2024

TS : డబుల్ ఇంజన్ సర్కారుతో అభివృద్ధి శూన్యం…ఎమ్మెల్యే గంగుల

డబుల్ ఇంజన్ సర్కారు అని చెప్పుకునే బీజేపీ ప్రభుత్వంతో అభివృద్ధి శూన్యమని బిఆర్ఎస్ హయాంలో నే కరీంనగర్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పేర్కొన్నారు. కరీంనగర్ సప్తగిరి కాలనీ లోని మానేరు వాకింగ్ ట్రాక్ పైన ఎమ్మెల్యే గంగుల కమలాకర్,నగర మేయర్ యాదగిరి సునీల్ రావు తో కలిసి బిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ ప‌ర్య‌టించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రానున్న పార్లమెంటు ఎన్నికల్లో కరీంనగర్ అభివృద్ధి ని చూసి బిఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ ను భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు. బిఆర్ఎస్ హయాంలోనే నగరం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని, కరీంనగర్ కు స్మార్ట్ సిటీ తీసుకువచ్చిన ఘనత వినోద్ కుమార్ కి దక్కుతుందన్నారు. మానేరు తీరంలో వాకింగ్ ట్రాక్ ను అద్భుతంగా తీర్చి దిద్దామన్నారు. కరీంనగర్ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని నగరవ్యాప్తంగా 14 వాకింగ్ ట్రాక్ లు ఏర్పాటు చేశామని, పార్లమెంటులోప్రజల పక్షాన కొట్లాడి నిధులు తీసుకొచ్చేందుకు పోరాటం చేసే ఎంపీలు ఉండాలన్నారు. ఇప్పటికే నగరానికి మానేర్ రివర్ ఫ్రంట్ తోపాటు టిటిడి ఆలయం నిర్మాణానికి 25 కోట్ల నిధులు తీసుకొచ్చారని వెల్లడించారు.

- Advertisement -


కేంద్రంలో ఎవరున్నా నిధులు తెచ్చేటోడు కావాలిః ఎంపీ అభ్య‌ర్థి వినోద్‌..
కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా కొట్లాడి నిధులు తీసుకొచ్చి సత్తా ఉన్న అభ్యర్థి కే ఓటేయ్యాలన్నారు. కరీంనగర్ ను వైబరెంట్ సిటీ గా తీర్చి దిద్దెందుకు కృషి చేస్తానని వెల్లడించారు. ప్రజల ఆకాంక్షల మేరకు కరీంనగర్ ను అన్నిరంగాల్లో అభివృద్ధి చేసామన్నారు. ఎమ్మెల్యే, ఎంపీ బిఆర్ ఎస్ పార్టీకి చెందిన వారైతే అభివృద్ధిలో పరిగెడుతుందన్నారు.. తాను 2014 నుండి 2019 వరకు ఎంపీగా ఉన్నప్పుడు కరీంనగర్ అభివృద్ధిపై దృష్టి పెట్టి నగరాన్ని స్మార్ట్ సిటీగా తీర్చి దిద్దడంతో పాటు జాతీయ రహదారుల హాబ్ గా మార్చడం.. హైదరాబాదు నుండి సిద్దిపేట సిరిసిల్ల వేములవాడ మీదుగా రైల్వే లైన్ ను సాంక్షన్ చేయించడం జరిగిందన్నారు. ఇప్పటివరకు సిద్దిపేట వరకు రైలు నడుస్తుందని వచ్చే డిసెంబర్ 2025 సంవత్సరం వరకు కరీంనగర్ నుండి హైదరాబాదుకు నేరుగా వెళ్లే విధంగా పనులు చేపట్టామని.. పనులన్నీ చివరి దశలో ఉన్నాయని గుర్తు చేశారు. కరీంనగర్ ను విద్యా కేంద్రంగా మార్చాలని సంకల్పంతో కేంద్రంలోని త్రిబుల్ ఐటీ కోసం టిఆర్ఎస్ హయంలో50 ఎకరాల భూమిని కూడా కేటాయించామని అన్నారు.. గురువిస్తావజాతు తాను ఎంపీగా ఓడిపోవడంతో గెలిచిన ఎంపీ ఆ పనులపై దృష్టి పెట్టలేదని ఆవేదన వ్యక్తం చేశారు.. కరీంనగర్ అభివృద్ధిపై చిత్తశుద్ధి ఉన్న తనను రానున్న ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించాలని నగర ప్రజలను కోరారు.. ఈ కార్యక్రమంలో నగర మేయర్ యాదగిరి సునీల్ రావు, కార్పొరేటర్లు తోటరాములు, దిండిగాల మహేష్, ఐలేందర్ యాదవ్, చాడగొండ బుచ్చిరెడ్డి, మాజీ కార్పొరేటర్ ఏవి రమణ, నాయకులు కర్ర సూర్య, శేఖర్, జక్కుల నాగరాజు, సిద్ధం వేణు, దూలం సంపత్ గౌడ్, సాయి తదితరులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement