Monday, November 25, 2024

వైఎస్ఆర్టీపీ ఆవిర్భావం.. ఓ సినిమా ఆడియో ఫంక్షన్

షర్మిల పార్టీ అవిర్భావ కార్యక్రమం ఓ సినిమా ఆడియో ఫంక్షన్ లాగే ఉందని, అంతకు మించి ఏమీ లేదని బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణ సాగర్ రావు అన్నారు. ఆ పార్టీకి ఓ సిద్ధాంతం లేదని విమర్శించారు. మొత్తం కార్యక్రమం పసలేని సాగదీత డైలీ టీవీ సీరియల్ లాగా ఉందన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అనే ఆలోచనకే బద్ద వ్యతిరేకి వై ఎస్ రాజశేఖర్ రెడ్డి అని అన్నారు. తెలంగాణ ప్రజల ఉద్యమాన్ని అణిచివేయడానికి తన శాయ శక్తుల ప్రయత్నించి ప్రత్యేక రాష్ట్ర కాంక్షను  వ్యతిరికించారని తెలిపారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారసత్వాన్ని తిరిగి తెలంగాణలో తీసుకువస్తానంటున్న షర్మిల వ్యూహం బెడిసికొడుతుందన్నారు. షర్మిల పార్టీకి తెలంగాణలో స్థానం, అవసరం, చోటు ఏవీ లేవన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే షర్మిల పార్టీ అనేది ఆంధ్రా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి తెలంగాణలో రాష్ట్రంలో స్వయం ఉపాధి పథకం లాంటిదని వ్యాఖ్యానించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement