రైతుల పట్ల తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు గుప్పించారు. తెలంగాణలో ప్రతి రంగంలోనూ ప్రజలు రోడ్డెక్కి నిరసనలు తెలపాల్సి వస్తోందని వైఎస్ షర్మిల అన్నారు. ‘విద్య కోసం రోడ్డెక్కాలి.. వైద్యం కోసం రోడ్డెక్కాలి.. న్యాయం కోసం రోడ్డెక్కాలి.. పండిన పంట కొనుగోలు కోసం రోడ్డెక్కాలి.. కొన్న పైసల కోసం పాట్లు పడాలి.. నెలల తరబడి పంట కొనుగోలు కేంద్రాల్లో వడ్లు వర్షం పాలైతున్నయి అని మొత్తుకుంటున్నా మీకు రైతు గోస కనపడదు.. వినపడదు’ అని షర్మిల ట్వీట్ చేశారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement