తెలంగాణలో లక్షల ఎకరాల భూములు మింగేందుకు ప్రభుత్వం ప్లాన్ వేసిందని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల విమర్శలు అన్నారు. ఎవరి పేరుమీదా రిజిస్టర్ కాని ‘శ్రీ’ పేరిట ఉన్న లక్షల ఎకరాలను మింగేందుకే ధరణిని తీసుకొచ్చారని ఆమె ఆరోపించారు. పేదల భూములను లాక్కొని దొరలకు కట్టబెట్టేందుకే సీఎం కేసీఆర్ ధరణి ఏర్పాటు చేశారు తప్ప భూరికార్డుల ప్రక్షాళనకోసం కాదని విమర్శించారు.
‘భూములు ఉన్నోళ్లకు లేనట్టు.. లేనోళ్లకు ఉన్నట్టు.. తప్పుల తడకగా తయారైంది ధరణి. దానికి తోడు అధికార్ల చేతివాటంతో బతికున్నోళ్లను చంపేసి ఇతరులకు పట్టాలు కట్టబెడుతున్నారు. సిరిసిల్ల జిల్లాలో నా భూమిని నాకు ఇప్పించండని .. నా పేరున పట్టా చేయాలని ఏండ్ల తరబడి తిరిగి చివరకు ఎమ్మార్వో ఆఫీసుకు తాళిబొట్టు కట్టింది ఓ మహిళ. ఇది దొరగారు తెచ్చిపెట్టిన ధరణి కష్టాలు’ అంటూ షర్మిల మండిపడ్డారు.
ఇది కూడా చదవండిః గాంధీకి అమెరికా ప్రతిష్ఠాత్మక ‘కాంగ్రెషనల్ గోల్డ్ మెడల్’