Friday, November 22, 2024

కేసీఆర్ దొర ఏమ‌య్యాడో?: షర్మిల

తెలంగాణ సీఎం కేసీఆర్ పై వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించాలని డిమాండ్ చేశారు. క‌రోనా క‌ష్ట‌కాలంలో పేద విద్యార్థుల ఫీజులు త‌గ్గించాల్సింది పోయి భారీగా పెంచ‌డం దారుణమన్నారు. ఒక్కో కోర్సుపై రూ.10 వేల నుంచి రూ.40 వేల భారం మోపుతున్నారని ఆరోపించారు. ఇవి ఇంకా క‌నిష్ట‌మేనంటూ విద్యాశాఖ పేర్కొన‌డం దుర్మార్గం అని మండిపడ్డారు. KG to PG ఉచిత విద్య అందిస్తామ‌ని ప్ర‌గ‌ల్భాలు ప‌లికే కేసీఆర్ దొర ఏమ‌య్యాడో అని షర్మిల వ్యాఖ్యానించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థుల‌కు రెండేండ్లుగా ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించ‌ని ప్ర‌భుత్వం.. ఫీజులు మాత్రం పెంచుకుంటూ పోతోందని మండిపడ్డారు. రాష్ట్రంలో 12.5ల‌క్ష‌ల విద్యార్థుల‌కు రూ.3,816 కోట్ల రీయింబ‌ర్స్ మెంట్ అంద‌క ఇబ్బందిప‌డుతున్నారని చెప్పారు. వెంట‌నే పెండింగ్ బకాయిలు విడుద‌ల చేయాలని షర్మిల డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement