Tuesday, November 26, 2024

ఇంకెంత మంది చస్తే వడ్లు కొంటారు?

తెలంగాణ సీఎం కేసీఆర్ పై వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. తాను పెద్ద రైతునని చెప్పుకునే ముఖ్యమంత్రి కేసీఆర్ మొద్దు నిద్ర పోతున్నారని ఆమె అన్నారు. రెండు నెలలుగా ధాన్యం కల్లాల్లో పెట్టుకొని రైతులు కన్నీళ్లు పెడుతున్నా… దొరకు కనిపించడం లేదని దుయ్యబట్టారు. వడ్లు కొనకుండా రాష్ట్రంలో ధర్నాలు, ఢిల్లీలో డ్రామాలు చేస్తున్నారని మండిపడ్డారు. దీంతో మరో రైతు గుండె ఆగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘అయ్యా కేసీఆర్, ఇంకెంత మంది చస్తే వడ్లు కొనుగోలు చేస్తారు?’ అంటూ షర్మిల ప్రశ్నించారు.

ఇంకెంత మంది రైతుల ఉసురు తీస్తే మీ కళ్లు చల్లబడతాయని షర్మిల అడిగారు. కల్లాల్లో ఉన్న రైతును కాటికి పంపుతున్నారని మండిపడ్డారు. యాసంగి పంటలతో బిజీగా ఉండాల్సిన రైతును పాడె ఎక్కిస్తున్నావని ధ్వజమెత్తారు. వడ్లు కొనమని రైతులతో కాళ్లు మొక్కించుకుంటున్నావని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీది రైతు ప్రభుత్వం కాదని… రైతును కాల్చుకుతింటున్న రైతు పాలిట రాబంధు ప్రభుత్వమని షర్మిల ఘాటుగా వ్యాఖ్యానించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement