వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల తెలంగాణ సీఎం కేసీఆర్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఉద్యోగాల కోసం లక్షలాది మంది యువత ఎదురుచూపులు చూస్తున్నారని ఆమె చెప్పారు. ‘ఉన్న ఉద్యోగులకే జీతాలు ఇవ్వలేక ఆస్తులను అమ్ముతున్నామని, ఇక కొత్తగా ఉద్యోగాలు ఇస్తే సీఎం సీటు అమ్ముకోవాల్సి వస్తుంది అనుకుంటున్నావా కేసీఆర్? అందుకనే ఏ ఉద్యోగాన్ని నింపడం లేదా? లేక ఇప్పుడే ఎన్నికలు లేవు.. మరో రెండేండ్ల వరకు నాకు ఏ డోకా లేదు అప్పుడు ఇవ్వచ్చు అనుకొంటున్నావా?’ అంటూ ఆమె ప్రశ్నించారు.’అందుకే నాలుగు ఏండ్ల నుంచి టెట్ నిర్వహించడం లేదా కేసీఆర్? ఇప్పటికే నాలుగురన్న లక్షల మంది టెట్ కోసం ఎదురు చూస్తున్నారు. నువ్వు టీచర్ పోస్టులు ఎలాగో వేయవు, కనీసం వాళ్లు ప్రైవేట్ లోనైనా చేసుకొనేందుకు వెంటనే టెట్ నిర్వహించండి. దానితో పాటు ఖాళీగా ఉన్న ప్రతి ఉద్యోగాన్ని భర్తీ చేయండి’ అని షర్మిల అన్నారు.
ఇది కూడా చదవండి: