వైఎస్ షర్మిల తెలంగాణ సీఎం కేసీఆర్ పై మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. కేసీఆర్ కి తెలంగాణ ప్రజల కంటే ఓట్ల మీదే ఎక్కువ ప్రేమ అని దుయ్యబట్టారు. కరోనాతో వేల మంది చనిపోయినా కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చలేదు. ఇప్పుడు ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లించకుండా పేదలకు ఉచిత వైద్యాన్ని అడ్డుకొంటున్నాడు. ఎవడు ఎక్కడ సచ్చినా నేను మాత్రం ఎన్నికల్లో చావకూడదని ఉప ఎన్నికలలో వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాడు’ అని షర్మిల ఆరోపణలు గుప్పించారు. ఆరోగ్య శ్రీ బిల్లులు చెల్లించకపోవడంతో పేదలు వైద్యం కోసం ఇబ్బందులు పడుతున్నారని ఆమె చెప్పారు. ఉద్యోగాలు ఇవ్వకుండా నిరుద్యోగులను, భూములను గుంజుకొని రైతులను, వైద్యం అందకుండా పేదోళ్లను చంపుతున్నారు కేసీఆర్ సారు. బంగారు తెలంగాణ అంటే మీ కుటుంబం ఒక్కటే సల్లగా బతుకుడా దొరా?’ అని షర్మిల నిలదీశారు.
ఇది కూడా చదవండి: ఏడేళ్లలో దళితులకు ఏం చేశారు ?: కేసీఆర్ పై నిప్పులు చెరిగిన ప్రవీణ్