Tuesday, November 26, 2024

ఎలక్షన్ తరహాలో వ్యాక్సిన్లను వేగంగా అందించాలి: షర్మిల

వ్యాక్సినేష‌న్‌పై కేంద్ర ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యంపై వైఎస్ ష‌ర్మిల ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘ఇప్పటికైనా మోదీ గారు అందరికి ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తామనడం సంతోషం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిమీద ఒకరు బట్టకాల్చి మీదేసుకొనే ప్రయత్నాలు మానేసి 3వ వేవ్ రాకముందే అందరికి వ్యాక్సిన్ ను  త్వరితగతిన, ఎలక్షన్ లు ఎంత వేగవంతంగా జరిపించారో అంతే వేగంగా వ్యాక్సిన్ అందించాలని కోరుతున్నాం’ అని వైఎస్ ష‌ర్మిల ట్వీట్ చేశారు.

దేశంలో వ్యాక్సినేష‌న్‌పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న‌ కీలక ప్రకటన చేసిన విష‌యం తెలిసిందే. దేశ వ్యాప్తంగా 18 సంవత్సరాలు దాటిన వారందరికీ వ్యాక్సిన్‌ వేయించే బాధ్యతను కేంద్ర ప్ర‌భుత్వ‌మే తీసుకుంటుందని మోదీ ప్రకటించారు.  వ్యాక్సిన్ల‌ కోసం రాష్ట్ర ప్రభుత్వాలు రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదని చెప్పారు. త‌మ నిర్ణ‌యాన్ని ఈ నెల 21వ తేదీ నుంచే అమ‌లు చేస్తామ‌ని ప్రకటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement