Wednesday, November 20, 2024

ప్రభుత్వానికి దొరకని వ్యాక్సిన్లు ప్రైవేట్‌కు ఎలా దొరుకుతున్నయి కేసీఆర్ సారూ: ష‌ర్మిల

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ఫై వైఎస్ ష‌ర్మిల తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. ప్రైవేట్ ఆసుప‌త్రుల టీకా దందా పేరిట ఓ దిన‌ప‌త్రిక‌లో వ‌చ్చిన క‌థ‌నాన్ని ఆమె పోస్ట్ చేశారు. ఒక్కో డోసుకు రూ.1,250 నుంచి రూ.1,600 తీసుకుంటున్నార‌ని, ఐదు రోజుల్లో రూ.21 కోట్ల బిజినెస్ చేశార‌ని ఆ క‌థ‌నంలో పేర్కొన్నారు. ప్రైవేట్ బిజినెస్‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం అండగా నిలుస్తోంద‌ని అందులో చెప్పారు. ఈ విష‌యాల‌ను షర్మిల ప్ర‌స్తావించారు.

ప్రభుత్వానికి దొరకని కరోనా వ్యాక్సిన్లు ప్రైవేట్‌కు ఎలా దొరుకుతున్నయి కేసీఆర్ సారూ. మీకు చేతకాకనా?  ప్రజల ప్రాణాలంటే పట్టింపు లేకనా? కమీషన్లకు ఆశపడా? లేక వ్యాక్సిన్ల భారం తగ్గించుకునేందుకా? ఇంకెన్నాళ్లు దొరా మూత‌కండ్ల‌ ప‌రిపాల‌న‌..?’ అని ష‌ర్మిల విమ‌ర్శ‌లు గుప్పించారు. తలాపున సముద్రమున్నా చాప దూపకేడ్చినట్టు. వ్యాక్సిన్ల తయారీ సంస్థలు గీడ‌నే ఉన్నా మీకు మాత్రం దొరకటం లేదా? ప్ర‌భుత్వ ఆసుప‌త్రుల్లో ఫస్ట్ డోస్ బందుపెట్టి నెలరోజులైంది. ప్రైవేట్‌కు మాత్రం దొరుకుతున్న‌య్‌. ఇప్పటికైనా మీ రీతి మార్చుకొని, ప్ర‌జ‌ల‌కు ఉచితంగా వ్యాక్సిన్ అందించండి’ అని ష‌ర్మిల డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement