Wednesday, November 20, 2024

రైతుల సమస్యలు తెలుసుకున్న షర్మిల

వికారాబాద్ జిల్లా దోమ మండలం పాలెపల్లిలోని వరి కొనుగోలు కేంద్రం వద్ద ఉన్న వరి ధాన్యాన్ని వైఎస్ షర్మిల పరిశీలించారు. రైతులతో పాటు నేలపై కూర్చొని  రైతుల సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. వరి కొనుగోలు కేంద్రం వద్ద వారు పడుతున్న సమస్యలను షర్మిలకు వివరిస్తున్నారు రైతులు. తేమ శాతం,తాళు అంటూ మూడు నుంచి ఐదు కిలోల వరకు తరుగు తీస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

కాగా, హైదరాబాద్ నుంచి పాలెపల్లికి బయల్దేరిన షర్మిలను పోలీసులు మార్గ మధ్యలో అడ్డుకున్నారు. వికారాబాద్ జిల్లా చింతపల్లి దగ్గరకు రాగానే ఆమె  కాన్వాయ్‌ను పోలీసులు నిలిపివేశారు. కొవిడ్ నిబంధ‌న‌ల కార‌ణంగా షర్మిల కాన్వాయ్‌లో రెండు వాహనాలకే అనుమతి ఉందని తెలిపారు. నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘించారంటూ కాన్వాయ్‌లోని ఇతర వాహనాలను చింతపల్లి దగ్గర పోలీసులు నిలిపివేయ‌డంతో ష‌ర్మిల మ‌ద్ద‌తుదారులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

మరోవైపు దివంగత మాజీ సీఎం వైఎస్ఆర్ జయంతి రోజున తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేయాలని నిర్ణయించిన ఆయన కూతురు వైఎస్ షర్మిల.. ఇందుకోసం వేగంగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పేరును ఖరారు చేశారు. అంతేకాదు తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు సంధిస్తున్నారు. తెలంగాణలో సంక్షేమం కోసమే తాను కొత్త పార్టీ పెడుతున్నానని ప్రకటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement