నిజామాబాద్ జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని మంజీరా నదిలో యథేచ్ఛగా ఇసుక మాఫియా సాగుతోందని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. సామాన్య జనం ఇసుక రవాణాను అడ్డుకుంటే వారిపై పీడీ యాక్టు, రౌడీ షీట్ ఓపెన్ చేసి జైళ్లలో పెడుతున్నారని మండిపడ్డారు. బంగారు తెలంగాణను దోపిడీ, దొంగల తెలంగాణగా మారుస్తున్నారని ధ్వజమెత్తారు. దళితుల ప్రాణాలంటే కేసీఆర్‌కు లెక్కలేదన్నారు. ఇసుక మాఫియాపై వెంటనే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఇసుక దందా వెనక ఎవరెవరు ఉన్నారు? ఎవరికి ఎంత వాటా వెళ్తుంది? దోషులెవరో తేల్చాలని షర్మిల డిమాండ్ చేశారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement