జైనూర్, జనవరి 8 (ఆంధ్రప్రభ) : యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని స్వయం ఉపాధిపై దృష్టి సారించాలని కొమురం భీం ఆసిఫాబాద్ ఏఎస్పీ చిత్తరంజన్ అన్నారు. ఆయన నూతన బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారిగా జైనూర్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మితంగా తనిఖీ చేయడంతో జైనూర్ ఎస్సై సాగర్ పోలీసులు స్వాగతం పలికారు.
మార్లవాయి యువకులకు ఎస్ఐ సాగర్ తో కలిసి వాలీబాల్ కిట్లను పంపిణీ చేశారు. ఏఎస్పీ యువకులకు కరచలనం చేసి యువకులతో మాట్లాడుతూ… యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని క్రీడలతో పాటు చదువులో రాణించాలని ఏఎస్పీ సూచించారు. పలు విషయాలపై యువతకు సూచనలిచ్చారు. ఈ కార్యక్రమంలో సిర్పూర్ (యు)ఎస్ఐ రామకృష్ణ, పోలీసులు, యువకులు పాల్గొన్నారు.