Monday, December 2, 2024

BRS | యూత్ కాంగ్రెస్ నేత సాయికిరణ్ రావు బీఆర్ఎస్ లో చేరిక

లండన్ లో బీఆర్ఎస్ పార్టీలో చేరిన పలువురు ఎన్నారైలు
లండన్ : ప్రస్తుతం లండన్ లో ఉంటున్న పలువురు ఎన్నారైలు, కరీంనగర్ జిల్లాకి చెందిన కాంగ్రెస్ నాయకుడు సాయి కిరణ్ రావు, తెలంగాణలోని వివిధ జిల్లాలకు చెందిన నర్సింగ రావు, పవన్ కళ్యాణ్, భరత్ రావు, హర్ష వర్ధన్ రెడ్డి, సంజయ్ రెడ్డి, నందీప్ దొగ్గల తదితర ఎన్నారైలు… ఎన్నారై బీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. వీరికి అనిల్ కూర్మాచలం కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

సాయి కిరణ్ రావు కరీంనగర్ నియోజికవర్గ ఎన్.ఎస్.యూ.ఐ రాష్ట్ర కార్యదర్శిగా, యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులుగా పనిచేసి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఎంతో కృషి చేశానని, కానీ తెలంగాణలో సంవత్సర కాలంగా జరిగిన విధ్వసం చూసి చాలా బాధపడుతున్నానని, ప్రపంచంతో పోటీపడి కేసీఆర్, కేటీఆర్ లు తెలంగాణను ఎంతో అభివృద్ధి చేశారని, ఇలాంటి నాయకత్వం ఉంటేనే తెలంగాణకు మేలు జరుగుతుందని భావిస్తూ ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్టు సాయికిరణ్ రావు తెలిపారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయడంలో విఫలమైందని, కేసీఆర్ నాయకత్వాన్ని బలపరచాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్టు నర్సింగ రావు, పవన్ కళ్యాణ్, భరత్ రావు, హర్ష వర్ధన్ రెడ్డి, సంజయ్ రెడ్డి, నందీప్ దొగ్గల తెలిపారు.

- Advertisement -

ఒక రాజకీయ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పనిచేసి ఎంతో కష్టపడి, ప్రస్తుతం అధికారం వచ్చినప్పుడు అందులో ఉండకుండా తెలంగాణ అభివృద్ధి కేవలం కేసీఆర్ నాయత్వంతోనే జరుగుతుందని భావించి బీఆర్ఎస్ పార్టీలో చేరిన సాయికిరణ్ రావు, ఇతర ఎన్నారైలు నర్సింగ రావు, పవన్ కళ్యాణ్, భరత్ రావు, హర్షవర్ధన్ రెడ్డి, సంజయ్ రెడ్డి, నందీప్ దొగ్గల అభినందించి, రానున్న రోజుల్లో వారికి తగిన గౌరవం పార్టీ ఇస్తుందని, వారి అనుభవాన్ని, నాయకత్వాన్ని కూడా పార్టీ ఉపయోగించుకుంటుందని, వారిని పార్టీలోకి అనిల్ కూర్మాచలం స్వాగతించారు. ఈ సమావేశంలో ఎన్నారై బీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం, ఎన్నారై బీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు నవీన్ రెడ్డి, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement