Sunday, June 30, 2024

ADB : నిర్మ‌ల్ జిల్లాలో యువ‌కుడి దారుణ హ‌త్య

నిర్మల్ ప్రతినిధి, మే 11 (ప్రభ న్యూస్) నిర్మ‌ల్ జిల్లాలో యువ‌కుడు దారుణ హ‌త్య‌కు గుర‌య్యాడు. పాత క‌క్ష‌ల నేప‌థ్యంలో ఘ‌ర్ష‌ణ జ‌ర‌గ‌గా అది కాస్త హ‌త్య‌కు దారితీసింది. ఘ‌ట‌న జిల్లా కేంద్ర‌మైన నిర్మ‌ల్‌లో చోటుచేసుకుంది.

- Advertisement -

వ్యక్తిగత కారణాలతో ముగ్గురు యువకుల మధ్య ఘ‌ర్షణ చోటుచేసుకుంది. ఈ క్ర‌మంలో చిక్కడ‌ప‌ల్లికి చెందిన జిషాన్, బుధవార్‌పేట‌కు చెందిన మతిన్ పై సుమీర్ అనే యువకుడు కత్తితో దాడిచేశాడు. ఈ దాడిలో జిషాన్ అనే యువకుడు మృతి చెందగా మతిన్ పరిస్థితి విషమంగా ఉంది. హత్య గల కారణాలు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement