ఓ గుర్తు తెలియని యువతి శవం కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం లోయర్ మానేరు డ్యాంలో లభ్యమైంది. యువతి మృతి పై పలు అనుమానాలున్నాయని స్థానికులంటున్నారు. ఆ యువతి ఆత్మహత్యకు పాల్పడిందా ? లేక ఆమెను ఎవరైనా హత్య చేసి లోయర్ మానేరు డ్యాంలో పడేశారా అనేది తేలాల్చి వుంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అయితే యువతి ఎప్పుడు మరణించింది.. ఎలా మరణించింది అనేది పోస్టు మార్టం రిపోర్ట్ తర్వాతే తేలనుంది.
లోకల్ టు గ్లోబల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం ఫేస్బుక్, ట్విట్టర్ పేజీలను ఫాలో అవ్వండి..