Saturday, November 23, 2024

ఉద్యోగాలు సృష్టించే స్థాయికి ఎదిగేలా యువ‌త ఆలోచ‌న‌లుండాలి : మంత్రి కేటీఆర్


ఉద్యోగాల కోసం విద్యార్థులు ఎదురుచూడటం కాకుండా.. ఉద్యోగాలు సృష్టించే స్థాయికి ఎదిగేలా యువత ఆలోచనలుండాల‌ని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. హైద‌రాబాద్ న‌గ‌రంలోని నిజాం కాలేజీ హాస్టల్ భవనాన్ని ప్రారంభించిన అనంతరం కళాశాల గ్రాడ్యుయేషడే వేడుకల్లో కేటీఆర్, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. ఈసంద‌ర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ…. ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న నిరుద్యోగులు ఇవాళ సంతోషపడే రోజుని.. 80వేలకు పైగా ఉద్యోగాలకు ప్రకటనలు రాబోతున్నాయన్నారు. ఎన్నో ప్రముఖ కంపెనీలకు భారతీయులు సీఈవోలుగా ఉన్నారని… ప్రముఖ కంపెనీలను సృష్టించేలా ఎదగాలన్నారు. కళాశాల చదువులు పూర్తయ్యాకే వాస్తవ జీవితం అంటే ఏంటో తెలుస్తుందన్నారు. గ్రాడ్యుయేషన్ పూర్తి కాగానే వేల ఉద్యోగాలు సిద్ధంగా ఉండటం అదృష్టంగా భావించాలన్నారు. ప్రైవేట్ రంగంలోనూ అనేక ఉద్యోగావకాశాలున్నాయని కేటీఆర్ పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement