ఖమ్మం జిల్లా రఘునాధపాలెం మండలం శివాయిగుడెం సమీపంలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది, పోలీసుల కథనం ప్రకారం పువ్వాడ ఉదయ్ నగర్ గ్రామానికి చెందిన షేక్ నాగుల్ మీరా(24) తాపీ మేస్త్రి గా జీవనం సాగిస్తున్న తను రోజువారీగా పని నుంచి వచ్చి భోజనం చేసి తిరిగి పనికి వెల్లే క్రమంలో ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు తగలడం తో అక్కడిక్కడే మృతి చెందారు, విషయం తెలిసిన కుటుంబ సభ్యులు రోదిస్తూ ఇటీవలే తమ కుమార్తె చనిపోయిందని ఆ బాధ మరువక ముందే కుమారుడు రోడ్డు ప్రమాదం లో చనిపోవడం జీర్ణించుకోలేక కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టించింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..