Friday, November 22, 2024

జిమ్ నుండి ఇంటికి వ‌చ్చి.. గుండెపోటుతో యువ‌కుడు మృతి

మ‌రో యువ‌కుడు గుండెపోటుతో క‌న్నుమూశాడు. మాజిద్ హుస్సేన్ షోయబ్ అలియాస్ జున్ను (23) రోజులానే జిమ్‌కు వెళ్లి వ్యాయామం చేసి ఇంటికి చేరుకున్నాడు. రాత్రి 11 గంటల సమయంలో చాతీలో నొప్పిగా ఉందంటూ వాంతులు చేసుకున్నాడు. అయితే, దానిని గుండెపోటుకు సంకేతంగా భావించని జున్ను ఇంటిముందు వాకింగ్ చేయడం ప్రారంభించాడు.

తర్వాత కాసేపటికే గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే అతడిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్టు నిర్ధారించారు. మహబూబ్ నగర్‌లో ఈ సంఘ‌ట‌న‌ జరిగింది. ప్రతి రోజూ ఎక్కడో ఓచోట ఇవి వెలుగు చూస్తున్నాయి. మరీ ముఖ్యంగా వ్యాయామం చేస్తూనో, చేసిన తర్వాతో గుండెపోటుతో యువకులు కుప్పకూలి మరణిస్తున్న ఘటనలు తరచూ జరుగుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement