Friday, November 22, 2024

NZB: పెళ్లి కాలేదనే మనస్థాపంతో యువకుడి ఆత్మహత్య

తాడ్వాయి, ప్రభ న్యూస్ (అగస్ట్ 1) : తాడువాయి మండల కేంద్రానికి చెందిన ఓ యువకుడు పెళ్లి కావడం లేదని తనకు ఎవరూ అమ్మాయిని ఇచ్చే పరిస్థితి లేదని మనోవేదనకు గురై ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తాడ్వాయి వై ఎస్ఐ ఆంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం… గ్రామానికి చెందిన జౌడీ శ్రీకాంత్ రెడ్డి (26) అనే యువకుడికి రెండు సంవత్సరాల క్రితం పెళ్లి సంబంధం కుదిరింది. తర్వాత ఆ పెళ్లి సంబంధం చెడిపోయింది. అప్పటి నుంచి శ్రీకాంత్ రెడ్డికి పెళ్లి సంబంధాలు రావడం లేదు. తనకు ఇక పెళ్లి అవుతుందో కాదో అని తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు.

దీంతో శ్రీకాంత్ రెడ్డికి జీవితంపై విరక్తి చెంది సోమవారం రాత్రి ఇంటి నుంచి వెళ్ళిపోయాడు. గ్రామ శివారులోని తన పొలంలో చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. రాత్రి సమయంలో ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు అక్కడ ఇక్కడ వెతికారు. ఎక్కడా ఆచూకీ దొరకలేదు. మంగళవారం ఉదయం కుటుంబ సభ్యులు పొలం వద్దకు వెళ్లి చూడగా.. చెట్టుకు ఉరివేసుకొని శ్రీకాంత్ రెడ్డి కనిపించాడు. ఈ విషయమై తండ్రి బాల్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు. మృతుడికి ఒక అక్క ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement