ప్రతి ఒక్కరి జీవితంలో యోగ భాగం కావాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. మానసిక ప్రశాంతతతో పాటు ఆరోగ్యంగా ఉండటానికి యోగ దోహద పడుతుందన్నారు. అరుణ యోగా ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ లో శిక్షణ పూర్తి చేసుకున్న 30 మందికి మంగళవారం మంత్రి నివాసంలో సర్టిఫికెట్లు ప్రధానం చేసారు. మన దేశంతో పాటు పలు ప్రపంచ దేశాల వారికి యోగ శిక్షణ ఇస్తున్న యోగ గురు అరుణ దేవిని మంత్రి అభినందించారు. గత 30 ఏళ్లుగా ఆమె అందిస్తున్న సేవలను మంత్రి కొనియాడారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital