తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి పంతం వీడారు. ఒకరంటే ఒకరికి పడకపోయేది. కానీ, సీఎం కేసీఆర్ కలిసి కట్టుగా పనిచేసుకోవాలని ఆదేశించడంతో ఇద్దరూ కలిసిపోయారు. రానున్న ఎన్నికల్లో తాండూరులో తనకు సపోర్టుగా నిలవాలని పైలట్ రోహిత్‌రెడ్డి మహేందర్‌రెడ్డి ఇంటికి వెళ్లి కోరారు. దీంతో ఇంతకాలం వారిద్దరి మధ్య ఉన్న పొరపొచ్చాలు సమసిపోయినట్టే అని అంతా అనుకుంటున్నారు. ఇక.. తాండూరు అసెంబ్లీ స్థానం నుంచి పైలట్ రోహిత్‌రెడ్డికి చాన్స్ రాగా, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డికి మంత్రి వర్గంలో చాన్స్ దక్కే అవకాశాలున్నట్టు వార్తలొస్తున్నాయి. దీనిపై ఇంకా క్లారిటీ రానప్పటికీ వీళ్లిద్దరూ ఇవ్వాల (సోమవారం) సాయంత్రం ఒకరినొకరు పలకరించుకుని, శాలువాలు కప్పుకుని సన్మానించుకున్నారు. దీంతో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి.
Advertisement
తాజా వార్తలు
Advertisement