Thursday, November 21, 2024

Exclusive | ఔను.. వాళ్లిద్దరూ ఒక్కటయ్యారు!

వాళ్లిద్దరూ ఒకే పార్టీ.. అయినా ఉప్పు, నిప్పులా చిటపటాలాడేవారు. ఒకరిపై ఒకరు ఆరోపణలు, విమర్శలు చేసుకునేవారు. అధిష్ఠానానికి కంప్లెయింట్స్​ కూడా వెళ్లేవి. అయితే.. ఇప్పుడు వాళ్లిద్దరూ ఒక్కటయ్యారు. ఇంతకీ వాళ్లెవరో తెలుసుకోవాలని ఇంట్రెస్ట్​గా ఉంటే.. ఈ వార్త మొత్తం చదవండి..

– వెబ్​ డెస్క్​, ఆంధ్రప్రభ

తాండూరు ఎమ్మెల్యే పైలట్​ రోహిత్​రెడ్డి ఎమ్మెల్సీ పట్నం మహేందర్​రెడ్డి పంతం వీడారు. ఒకరంటే ఒకరికి పడకపోయేది. కానీ, సీఎం కేసీఆర్​ కలిసి కట్టుగా పనిచేసుకోవాలని ఆదేశించడంతో ఇద్దరూ కలిసిపోయారు. రానున్న ఎన్నికల్లో తాండూరులో తనకు సపోర్టుగా నిలవాలని పైలట్​ రోహిత్​రెడ్డి మహేందర్​రెడ్డి ఇంటికి వెళ్లి కోరారు. దీంతో ఇంతకాలం వారిద్దరి మధ్య ఉన్న పొరపొచ్చాలు సమసిపోయినట్టే అని అంతా అనుకుంటున్నారు. ఇక.. తాండూరు అసెంబ్లీ స్థానం నుంచి పైలట్​ రోహిత్​రెడ్డికి చాన్స్​ రాగా, ఎమ్మెల్సీ పట్నం మహేందర్​రెడ్డికి మంత్రి వర్గంలో చాన్స్​ దక్కే అవకాశాలున్నట్టు వార్తలొస్తున్నాయి. దీనిపై ఇంకా క్లారిటీ రానప్పటికీ వీళ్లిద్దరూ ఇవ్వాల (సోమవారం) సాయంత్రం ఒకరినొకరు పలకరించుకుని, శాలువాలు కప్పుకుని సన్మానించుకున్నారు. దీంతో బీఆర్​ఎస్​ పార్టీ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement