Friday, November 22, 2024

తెలంగాణ‌కు ఎల్లో వార్నింగ్‌.. భారీ వ‌ర్షాలే ఉంటాయ‌ట‌..

ప్ర‌భ‌న్యూస్: రాష్ట్రాంలో రానున్న రెండ్రోజుల్లో భారీ నుండి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్న‌ట్టు వాతావ‌ర‌ణ కేంద్రం హైద‌రాబాద్ డైరెక్టర్ నాగ‌రత్న‌ తెలిపారు. ఈ రెండు మూడు రోజుల వ్య‌వ‌ధిలో తెలంగాణాలోని వాతావ‌ర‌ణం మేఘావృత్త‌మై ఉంటుంద‌న్నారు.

రాష్ట్రంలో ఎప్పుడూ ఉండే టెంప‌రేచ‌ర్స్ క‌న్నా రెండు నుంచి నాలుగు డిగ్రీల సెల్సీయ‌స్‌ త‌క్కువ‌గా ఉండ‌బోతున్న‌ట్టు నాగ‌ర‌త్న తెలిపారు. రాష్ట్రాంలోని మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌, గ‌ద్వాల‌, వ‌న‌ప‌ర్తి, నాగ‌ర్ క‌ర్నూల్‌, న‌ల్ల‌గొండ‌, ఖ‌మ్మం, కొత్త‌గూడెం, ములుగు, భూపాల‌ప‌ల్లి, వ‌రంగ‌ల్, నార‌య‌ణ‌పేట‌, మెద‌క్, వికారాబాద్ జిల్లాల్లో 48 గంట‌ల్లో ఉరుములు మెరుపుల‌తో కూడిన మోస్తరు వర్షపాతం న‌మోదు కానున్న‌ట్టు IMD అధికారులు తెలిపారు. దీనిపై ఎల్లో వార్నింగ్ కూడా జారీ చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement