హైదారాబాద్ – తుంటి ఆపరేషన్ తో సోమాజీగూడలోని యశోద హాస్పటల్లో చికిత్స పొందుతున్న కెసిఆర్ ను చూసేందుకు ప్రజా ప్రతినిధులు,అభిమానుల వెల్లువెత్తుతున్నారు..వేల సంఖ్యలో అక్కడి చేరుకుంటున్న అభిమాన గణంతో అక్కడి రోడ్లన్ని కిక్కిరిసిపోతున్నాయి.. .ఆస్పత్రి సిబ్బంది, పోలీసులే కాదు చివరకు కేసీఆర్ స్వయంగా తనను చూసేందుకు రావద్దని బీఆర్ఎస్ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు. తన కోసం వచ్చేవారు ఇతర పేషెంట్స్ కు ఇబ్బందికలిగే అవకాశం ఉందని రావద్దని కోరారు. అయినా కూడా బీఆర్ఎస్ శ్రేణులు, కేసీఆర్ అభిమానుల తాకిడి యశోద ఆస్పత్రికి తగ్గలేదు.
దీంతో చేసేదేమీలేక ట్రాఫిక్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. సోమాజిగూడ యశోద ఆసుపత్రికి వెళ్లే రహదారిని ట్రాఫిక్ పోలీసులు మూసివేశారు. ఖైరతాబాద్‌తో పాటు పంజాగుట్ట వైపు నుంచి రాజ్‌భవన్ రోడ్డులోకి ప్రవేశించే ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఈ విధంగా కేసీఆర్ కోసం యశోద ఆసుపత్రికి వెళ్లే వారినే కాకుండా రాజ్ భవన్ మార్గంలో నిత్యం ప్రయాణించే వారిని సైతం నిలిపివేశారు. మొత్తం రాజభవన్ రోడ్డును పూర్తిగా మూసివేశారు.. ప్రతి ఒక్కరూ,అలాగే వాహానాలు సైతం ఖైరతాబాద్ సర్కిల్ ప్రధాన రోడ్డు మీదుగా పంజాగుట్టా,ఆపై సోమాజీగూడకి వెళ్లవలసి ఉంటున్నది..