యాదాద్రి నారసింహా స్వామిని దర్శించుకునేందుకు భక్తులు వివిధ ప్రాంతాల నుంచి యాదాద్రికి తరలివస్తున్నారు. ఇవ్వాల (గురువారం) ఒక్కరోజు ఆలయానికి వచ్చిన భక్తులతో వివిధ రూపాల్లో రూ.46,65,974 ఆదాయం సమకూరిందని ఆలయ ఈవో తెలిపారు.
ప్రధాన బుకింగ్ ద్వారా రూ.1,06000, కైంకర్యముల ద్వారా రూ.800, సుప్రభాతం ద్వారా రూ.6,100, బ్రేక్ దర్శనం ద్వారా రూ. 1,60,200, వ్రతాల ద్వారా రూ. 1,16,000 ఆదాయం వచ్చిందని వివరించారు. వాహన పూజల ద్వారా రూ. 6,100 , వ్రత కైంకర్యాల ద్వారా రూ. 1,200, వీఐపీ(VIP) దర్శనం ద్వారా రూ. 1,20,000, ప్రచారశాఖ ద్వారా రూ. 50,400, పాతగుట్ట ద్వారా రూ. 32,320, కొండపైకి వాహనాల ప్రవేశం ద్వారా రూ. 3,00,000, యాదఋషి నిలయం ద్వారా రూ. 62,874 వచ్చిందన్నారు.
సువర్ణ పుష్పార్చన ద్వారా రూ. 90,800, శివాలయం ద్వారా రూ. 8000, పుష్కరిణీ ద్వారా రూ. 1,600, ప్రసాదవిక్రయం ద్వారా రూ. 11,20,900, శాశ్వత పూజల ద్వారా రూ. 10,000, కల్యాణ కట్ట ద్వారా రూ. 66,000, ఇతరముల ద్వారా రూ. 57,200, లీగల్ లిజస్ ద్వారా రూ. 23,28,572, అన్నదానం ద్వారా రూ. 20,908 ఆదాయం వచ్చిందని ఆలయ ఈవో వెల్లడించారు.