ఆంధ్రప్రభ స్మార్ట్, యాదాద్రి ప్రతినిధి: తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరి గుట్టకు భక్త జనం పోటెత్తారు. కార్తీక తొలి ఆదివారం కావడంతో ఉభయ రాష్ట్రాలతో పాటు తమిళనాడు, మహారాష్ట్ర, కర్నాటక తదితర రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు శ్రీలక్ష్మీనరసింహ స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. దీంతో యాదగిరి గుట్టతోపాటు పట్టణం కూడా భక్తజనంతో కిక్కిరిపోయింది.
సత్యనారాయణ వ్రతాల మండపం కిటకిటసత్యనారాయణ స్వామి నిర్వహించే మండపం భక్తులతో కిటకిటలాడింది. కార్తీక మాసంలో సత్యనారాయణ స్వామి వ్రతాలు చేయడం ఆనవాయితీ. తెల్లవారు జామున దీపారాధన అనంతరం వ్రతాలు కూడా అధిక మంది భక్తులు చేశారు. అనంతరం స్వామి వారిని దర్శించుకున్నారు.
దర్శనానికి బారులుయాదగిరి శ్రీలక్ష్మీనరసింహా స్వామి వారి దర్శనానికి తెల్లవారు జాము నుంచి భక్తులు బారులు తీరారు. తొలుత కార్తీక దీపారాధన చేసిన భక్తులు స్వామి వారి దర్శనానికి వెళ్లారు. ఆలయంలో ఉన్న క్యూలైన్ ద్వారా భక్తులు వెళ్లి స్వామి వారిని దర్శనం చేసుకున్నారు. ఘనంగా ఏర్పాట్లుభక్తుల రద్దీకి తగిన విధంగా ఘనంగా ఏర్పాట్లు చేశామని ఈఓ భాస్కరరావు తెలిపారు.
దర్శనాలు వేగవంతంగా అయ్యే విధంగా సిబ్బందికి ఆయన పలు సూచనలు చేశారు. దేవస్థానం సిబ్బంది, పోలీసు సిబ్బందిని సమన్వయం చేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టినట్లు ఆయన చెప్పారు..